Telangana Rains: హైదరాబాద్‌లో ఒంటి పూట బడి.. ఆ జిల్లాల్లో గురువారం కూడా స్కూళ్లకు సెలవు

తెలంగాణ అంతటికీ బుధవారం, గురువారం రెడ్‌ అలర్ట్‌ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న వెల్లడించారు. రాష్ట్రమంతటా గురువారం కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. . పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఉత్తర తెలంగాణలో 17న వర్ష తీవ్రత అధికంగా ఉండే చాన్స్ ఉందన్నారు.

Telangana Rains: హైదరాబాద్‌లో ఒంటి పూట బడి.. ఆ జిల్లాల్లో గురువారం కూడా స్కూళ్లకు సెలవు
Students In Rain

Updated on: Aug 13, 2025 | 5:37 PM

తెలంగాణలో భారీ వర్షాలు విస్తృతంగా కురిసి పలు జిల్లాలను ముంచెత్తాయి. వరుణుడు అప్పుడప్పుడు కాస్త గ్యాప్ ఇస్తూ.. దుమ్మురేపుతున్నాడు.  ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో సాధారణ జీవితానికి అంతరాయం కలిగింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఉత్తర్వుల ప్రకారం.. జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గురువారం కూడా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నీ మూసివేయాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అయితే గురువారం ఒంటిపూట పాఠశాలలు మాత్రమే నిర్వహించాలని, విద్యార్థులను మధ్యాహ్నం ఇంటికి పంపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

తాజాగా ఏయే ప్రాంతాల్లో ఎలాంటి అలెర్ట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం… 

రెడ్‌ అలర్ట్‌:  సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌, హైదరాబాద్‌, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి

ఆరెంజ్ అలర్ట్‌:  ఆదిలాబాద్‌, కొమురంభీం, మంచిర్యాల, కామారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, జనగామ, వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి

ఎల్లో అలర్ట్‌:  నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్‌, నిర్మల్‌

హైదరాబాద్‌లో భారీ వర్షం: హైదరాబాద్‌లో పలుచోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. ఫలితంగా రాకపోకలు అంతరాయానికి గురై నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్ మందగించి, అనేక ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..