TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరా పండగకు జేబీఎస్ నుంచి జిల్లాలకు అతి తక్కువ ధరలో ఓల్వో బస్సు సర్వీసులు

|

Oct 04, 2021 | 7:13 AM

TSRTC Volvo Bus: దసరా పండుగకు సొంత గ్రామాలకు వెళ్లే ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సు సర్వీసులు అందించనుంది. అందుకోసం.. టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరా పండగకు జేబీఎస్ నుంచి జిల్లాలకు అతి తక్కువ ధరలో ఓల్వో బస్సు సర్వీసులు
Tsrtc Volvo Bus
Follow us on

కరోనా కారణంగా పూర్తిగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు ఇప్పుడిప్పుడే రోడ్లెక్కాయి. క్రమంగా ప్రజాజీవితమూ కుదుట పడుతూ వస్తోంది. ఇక త్వరలో దసరా పండుగ రానుంది. పండుగకు ఊళ్లకు వెళ్ళే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపడానికి ప్రణాళికలు రెడీ చేసింది. కరోనా ఎఫెక్ట్ తొలగిన తరువాత వస్తున్న మొదటి పండుగ సీజన్ కావడంతో ప్రజలు అటూ ఇటూ తిరిగే అవకాశం ఉందని భావిస్తోంది తెలంగాణ ఆర్టీసీ. అందుకే ఈ సీజన్ లో ప్రయాణీకులకు అందుబాటులో బస్సు సర్వీసులను ఏర్పాటు చేసి కరోనా నష్టాల నుంచి కొంత ఉపశమనం పొందాలని టీఎస్‌ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

దసరా పండుగకు సొంత గ్రామాలకు వెళ్లే ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సు సర్వీసులు అందించనుంది. అందుకోసం.. టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దసరా పండగ నేపథ్యంలో జేబీఎస్ నుండి జిల్లాలకు ఓల్వో బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. అతి తక్కువ ధరలతో బస్ సర్వీసులు నడపనున్నట్లుగా సికింద్రాబాద్ రీజనల్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. పికెట్‌, జేబీఎస్‌ నుంచి కరీంనగర్‌, నిజామాబాద్‌, నిర్మల్‌, వరంగల్‌, ఖమ్మం, భద్రాచలం ప్రాంతాలకు రేపటి నుంచి అతి తక్కువ చార్జీతో లోఫ్లోర్‌, ఓల్వో బస్సు సర్వీసులను నడిపించనున్నట్లు తెలిపారు. రాజధాని, గరుడ బస్సులకు దీటుగా 16 ఓల్వో బస్సులను నడుపుతామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: డ్రగ్స్‌ కేసులో షారూక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ అరెస్ట్‌.. విచారణలో సంచలన విషయాలు వెల్లడి