Telangana Corona Cases: తెలంగాణలో తగ్గిన కరోనా వ్యాప్తి.. వెయ్యికి దిగువన పాజిటివ్ కేసులు..

|

Jun 27, 2021 | 8:32 PM

Telangana Corona Cases: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఇవాళ భారీగా తగ్గాయి. నాలుగు నెలల తరువాత తొలిసారి వెయ్యి..

Telangana Corona Cases: తెలంగాణలో తగ్గిన కరోనా వ్యాప్తి.. వెయ్యికి దిగువన పాజిటివ్ కేసులు..
Corona
Follow us on

Telangana Corona Cases: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఇవాళ భారీగా తగ్గాయి. నాలుగు నెలల తరువాత తొలిసారి వెయ్యి కంటే తక్కువ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 81,405 మంది నుంచి సాంపిల్స్ సేకరించగా.. వీరిలో 748 మందికి పాజిటివ్ అని తేలింది. ఇక రెట్టింపు సంఖ్యలో అంటే 1492 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రోజు వారీగా నమోదు అయ్యే మృతుల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోంది. ఒక్క రోజులో 8 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,302 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో కొందరు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 6,20,613 మందికి కరోనా సోకింది. వీరిలో 6,02,676 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే, కరోనా ప్రభావంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో చనిపోయిన వారి సంఖ్య 3,635 కి చేరింది. తెలంగాణలో రికవరీ రేటు 97.10 శాతం ఉండగా.. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ఇక ఒక్క రోజులో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్యలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 121 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత ఖమ్మం జిల్లాలో 61 కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. తెలంగాణలో వ్యాక్సీనేషన్ ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేసింది. కరోనా కట్టడికై ప్రభుత్వం.. కరోనా క్యారియర్లుగా గుర్తించిన వారందరికీ టీకాలు వేస్తోంది.

Also read:

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లకు పోటీ చేస్తాం….ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ… పొత్తు ఎవరితోనంటే …?