Telangana Covid Cases: తెలంగాణలో నిలకడగా నమోదవుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని పాజిటివ్ కేసులంటే..

|

Jul 17, 2021 | 8:10 PM

Telangana Corona Cases: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నిలకడగా నమోదు అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా 7 వందల..

Telangana Covid Cases: తెలంగాణలో నిలకడగా నమోదవుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని పాజిటివ్ కేసులంటే..
Corona Virus
Follow us on

Telangana Corona Cases: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నిలకడగా నమోదు అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా 7 వందల నుంచి 8 వందల మధ్య పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇవాళ కూడా అంతేస్థాయిలో నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 1,15,515 సాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. 729 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒక్క రోజులో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా దాదాపు అదే మాదిరిగా ఉంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 772 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఈ కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. తెలంగాణలో ఇప్పటి వరకు 6,36,049 మందికి కరోనా సోకగా.. 6,22,313 మంది కోలుకున్నారు. 3,756 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం తెలంగాణలో 9,980 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో చాలా వరకు కరోనా బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి తీవ్రంగా ఉన్నవారు మాత్రం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో పాజిటివ్ రేటు 1.57 శాతంగా ఉంది. రికవరీ రేటు 97.84 శాతంగా ఉంది. మరణాల రేటు 0.59 శాతంగా ఉంది.

ఇక తాజాగా తెలంగాణ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 71 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ 65 కేసులతో ఆ తరువాతి స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ 3, బద్రాద్రి కొత్తగూడెం 23, జీహెచ్ఎంసీ 71, జగిత్యాల 22, జనగామ 6, జయశంకర్ భూపాలపల్లి 13, జోగులాంబ గద్వాల 5, కామారెడ్డి 3, కరీంనగర్ 65, ఖమ్మం 52, కొమరంభీం ఆసిఫాబాద్ 5, మహబూబ్‌నగర్ 6, మహబూబాబాద్ 13, మంచిర్యాల 53, మెదక్ 6, మేడ్చల్ మల్కాజిగిరి 25, ములుగు 13, నాగర్ కర్నూల్ 4, నల్లగొండ 45, నారాయణ పేట 0, నిర్మల్ 4, నిజామాబాద్ 6, పెద్దపల్లి 53, రాజన్న సిరిసిల్ల 21, రంగారెడ్డి 26, సంగారెడ్డి 5, సిద్దిపేట 17, సూర్యాపేట 44, వికారాబాద్ 6, వనపర్తి 8, వరంగల్ రూరల్ 41, వరంగల్ అర్బన్ 47, యాదాద్రి భువనగిరి 18 పాజిటివ్ కేసుల చొప్పున నమోదు అయ్యాయి.

Also read:

Station Master: రైల్వే స్టేషన్‌లో తప్పతాగి గుర్రుపెట్టాడు.. వరుసగా ఆగిన రైళ్ళు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Astronaut: అంతరిక్షంలో అస్ట్రోనాట్స్‌ ఎలా జీవిస్తారో మీకు తెలుసా? వారేం తింటారో తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..

Washington : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకం.. కొనసాగుతున్న ఆపరేషన్.. ఆరేళ్ల చిన్నారి మృతి..