
అంతర్రాష్ట్ర దొంగల ముఠా.. ధార్ గ్యాంగ్‌కి చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్ అస్రఫ్ ఖాన్ అరెస్టు కాగా, మరో ముగ్గురు నిందితులు పరారిలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. మహమ్మద్ అస్రఫ్ ఖాన్‌పై దేశవ్యాప్తంగా పలు దొంగతనాల కేసులు ఉన్నాయి. ఏపీ నెల్లూరుకు చెందిన బోయిన వెంకటేశ్వర్లు.. ఈ నెల తొమ్మిదో తేదీన చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే శ్యామ్ సర్దార్ ట్రావెలింగ్ బస్సులో ప్రయాణించాడు. హైదరాబాద్‌లోని మౌరీ టెక్ సంస్థ యజమాని దామోదర్ రెడ్డికి సంబంధించి వ్యవసాయ భూమిని అమ్మగా వచ్చిన 25 లక్షల రూపాయలను హైదరాబాద్ తీసుకెళ్తున్నాడు. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి
సమీపంలోని పూజిత హోటల్ వద్ద టిఫిన్, మూత్ర విసర్జనకు వెళ్లి వచ్చేసరికి.. వెంకటేశ్వర్లు బ్యాగ్ మాయమైంది. దీంతో అతన నార్కెట్ పల్లి పోలీస్‌లకు వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పూజిత హోటల్ నందు సీసీ ఫూటేజిని పరిశీలించారు. మారుతి కారులో నలుగురు వ్యక్తులు వచ్చి ఒకరు వ్యక్తి బస్సులోకి ఎక్కి బ్యాగును తీసుకొని కారులో హైదరాబాదు వైపు వెళ్తున్నట్టుగా గుర్తించారు.
సీసీ ఫుటేజి ఆధారంగా నలుగురు వ్యక్తులు పాత నేరస్థులు మధ్యప్రదేశ్‌కు చెందిన థార్ గ్యాంగ్ గా పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశ్ లోని థార్ జిల్లాలో మనవార్ పోలీసు స్టేషన్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మహమ్మద్ అస్రఫ్ ఖాన్‌ను పట్టుకోగా, మరో ముగ్గురు నిందితులు పరారయ్యారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెబుతున్నారు. అస్రఫ్ ఖాన్ నుండి 25 లక్షల రూపాయల నగదు కారును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. థార్ గ్యాంగ్‌పై దేశవ్యాప్తంగా పలు కేసులు ఉన్నాయని ఆయనకు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..