Congress Leaders House Arrest: కేంద్రం ఎడాపెడా పెట్రోల్(Petrol), డీజిల్(Diesel) ధరలు పెంచుతోంది. దేశంలో చమురు ధరలు రోజురోజుకు సెగలు పుట్టిస్తోంది. కాగా, రాష్ట్రంలో ఈ నెల నుంచి విద్యుత్ ఛార్జీలు సైతం పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలు, విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) పార్టీ నేతలు ఆందోళన బాటపట్టారు. అందులో భాగంగా గురువారం.. విద్యుత్ సౌధ, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, మల్లు రవి, దాసోజు శ్రవణ్ తదితరులను హైదరాబాద్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంధన ధరలతో పాటు విద్యుత్ ఛార్జీలు తగ్గించడం, ధాన్యం కొనే దాకా కాంగ్రెస్ పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. వీటిపై ఇవాళ విద్యుత్‌సౌధ, సివిల్ సప్లయిస్ భవన్‌ల ముట్టడికి ఆయన పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఈ మేరకు ముందస్తు చర్యలు తీసుకున్నారు. రేవంత్ హౌస్ అరెస్ట్ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్ సీనియర్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కేంద్రం ఎడాపెడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పన్నులతో సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ప్రభుత్వ విధానాలపై నిరసన తెలుపుతుంటే.. అడ్డుకుంటారా అని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ప్రశ్నిస్తున్నారు.
Read Also… China Hackers Attack: మరోసారి బయటపడ్డ చైనా వక్రబుద్ధి.. భారత్ పవర్ గ్రిడ్‌పై హ్యాకర్ల దాడి..!