Telangana: రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ షురూ.. మధ్యాహ్నం కౌంటింగ్..

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 3,911 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 57 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు.

Telangana: రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ షురూ.. మధ్యాహ్నం కౌంటింగ్..
Telangana Panchayat Elections Phase 2

Updated on: Dec 14, 2025 | 7:52 AM

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7గటంలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. సర్పంచ్ ప్రకటన తర్వాత ఉపసర్పంచ్ ఎన్నుకుంటారు. రెండోదశ కింద మొత్తం 193 మండలాల్లోని 4,332 పంచాయతీలకు పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ అందులో 415 గ్రామాల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో ఐదు గ్రామాల్లో నామినేషన్లే దాఖలు కాలేదు. దీంతో ఇవాళ 3,911 పంచాయతీలకు, 29,917 వార్డులకు పోలింగ్‌ జరుగుతోంది. దీని కోసం మొత్తం 38,337 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక 57 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఈ సర్పంచ్‌ ఎన్నికల బరిలో 12,782 మంది పోటీపడుతుండగా, వార్డుల బరిలో 71,071 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు. లక్షా 30వేల సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు.