
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 11న రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 13వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7కార్పొరేషన్ల ఎన్నికలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే 28 నుంచి 30వ తేదీ వరకు అనగా రెండ్రోజుల పాటు ఈ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణ అంతటా 116 మున్సిపాలిటీలు, 7కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండదు.
అయితే GHMC ఒకే సంస్థగా కొనసాగుతుందా లేక మూడుగా విడిపోతుందా అనేది ఫిబ్రవరి 10 తర్వాత నిర్ణయిస్తామన్నారు మంత్రి పొన్నం. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే వారికి అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లిస్తేనే.. నామినేషన్ వేయడానికి అవకాశం కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.