Telangana MLC elections : ఎమ్మెల్సీ ఎన్నికల సిత్రాలు, భారీ డైలాగులు, ఓట్లు వేయకపోతే నాశనమైపోతారంటూ శాపనార్దాలు

Telangana MLC elections : తెలంగాణలో జరిగేవి ఎమ్మెల్సీ ఎన్నికలైనా, అయినా అసెంబ్లీ ఎలక్షన్‌ స్థాయిలో మాటల తూటాలు పేలుతున్నాయి. పవర్‌ఫుల్ డైలాగులతో ఎన్నికల ప్రచారాన్ని..

Telangana MLC elections : ఎమ్మెల్సీ ఎన్నికల సిత్రాలు, భారీ డైలాగులు, ఓట్లు వేయకపోతే నాశనమైపోతారంటూ శాపనార్దాలు

Updated on: Mar 06, 2021 | 6:29 PM

Telangana MLC elections : తెలంగాణలో జరిగేవి ఎమ్మెల్సీ ఎన్నికలైనా, అయినా అసెంబ్లీ ఎలక్షన్‌ స్థాయిలో మాటల తూటాలు పేలుతున్నాయి. పవర్‌ఫుల్ డైలాగులతో ఎన్నికల ప్రచారాన్ని రక్తికట్టిస్తున్నారు నేతలు. ఓట్లు వేయకపోతే నాశనమైపోతారంటూ కొందరైతే శాపనార్దాలు పెడుతున్నారు. ఇలా చిత్రవిచిత్రమైన వాతావరణంలో హాట్‌ హాట్‌గా ఎన్నికల కాంపైన్‌ సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎంతమంది ఉన్నా… పార్టీలు ఎన్ని పోటీ చేస్తున్నా… మాటల యుద్ధం మాత్రం TRS vs BJP అన్నట్టుగానే ఉంది. పవర్‌ఫుల్‌ డైలాగులు… పంచ్‌లతో ప్రచారం పీక్స్‌కు చేరింది. పకోడీ బండిని కూడా ఉద్యోగంగా చూపించి కేంద్రం మభ్యపెడుతోందన్నారు TRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. కరోనా సంక్షోభంలో 20 లక్షల కోట్ల ప్యాకేజ్‌తో లబ్ధిపొందినవారెవరో చూపించాలన్నారు. బీజేపీ నేతలు ఎగిరెగిరి పడుతూ.. కేసీఆర్‌పై నోరుపారేసుకుంటున్నారని.. అందరికీ మిత్తీతో సహా చెల్లిస్తామని KTR హెచ్చరించారు.

ఇక, మహబూబ్ నగర్‌లో ప్రచారం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. పథకాలతో లబ్ధిపొంది కూడా టీఆర్‌ఎస్‌కు ఓట్లేయకపోతే అంతకంటే ద్రోహం మరోటి ఉండదని మంత్రి శ్రీనివాసగౌడ్‌ అంటే.. TRS ప్రభుత్వం బ్లాక్‌మెయిల్‌కి దిగుతోందని ఆరోపించారు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క. తాము గెలవకపోయిన ఫర్వాలేదని… బీజేపీ మాత్రం విజయం సాధించకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇలాంటి కుటుంబ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన మహబూబ్ నగర్, మక్తల్, నారాయణపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

గతేడాది అక్టోబర్‌ 14న హైదరాబాద్‌ను వరదల ముంచెత్తాయి. దీనిపై అత్యున్నత నిపుణుల బృందంతో అధ్యయనం చేయించిన నీతిఆయోగ్‌… ఓ నివేదికను రూపొందించింది. ఇప్పుడు ఆ నివేదిక తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది. ఈ నివేదికలో నేరుగా రాష్ట్ర ప్రభుత్వాన్నే టార్గెట్ చేసింది నీతిఆయోగ్‌. ఆక్రమణలు ప్రస్తావిస్తూనే… తెలంగాణ ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళికలు లేవని తప్పుపట్టింది నీతి ఆయోగ్. జలవనరుల ఆక్రమణల వల్లే భారీ వరదలు హైదరాబాద్‌ ముంచెత్తాయన్న నీతి ఆయోగ్‌… హుస్సేన్‌సాగర్‌ గట్లు, నాలాలన్నీ ఆక్రమణకు గురవడమే సమస్యకు ప్రధాన కారణమని తేల్చింది.

అయితే, ఇదంతా గత పాలకుల అస్తవ్యస్త పాలనతో హైదరాబాద్‌కు ఈ దుస్థితి వచ్చిందని…. తాము వచ్చాక అన్నింటిని సరిచేస్తున్నామంటున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. ర్యాంకులు, నీతిఆయోగ్ నివేదిక ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. హైదరాబాద్ నగరాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా, రోజుకో అంశం తెరపైకి వస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలకు మంచి కిక్‌ ఇస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నంత మజా వస్తోంది నేతలకు.

Read also : Vijetha : విజేత సూపర్‌ మార్కెట్‌ ఇప్పుడు మణికొండలో.. మైహోమ్ గ్రూప్ డైరెక్టర్‌ జూపల్లి రామురావు, మిస్ఇండియా మానస చేతులమీదుగా..