ఎమ్మెల్యేల కొనుగోలు కేసుని జులై 31కి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం. దీంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎం.ఎం. సుందరేష్ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది పిటిషన్. ఈ కేసులో CBI ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. అయితే కేసు వివరాలు అందించాలంటూ.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్ని సార్లు లేఖరాసిన స్పందించలేదని.. BJP తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అటు CBI విచారణ జరపకుండా స్టే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. అయితే ఇందుకు సంబంధించిన కేసులో స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను జులై 31కి వాయిదా వేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. నిందితుల పిటీషన్లను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం విచారణలో తమకు న్యాయం జరగదని, సీబీఐకి అప్పగించాలని వారు హైకోర్టులో పిటీషన్ వేశారు. దీంతో హైకోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులై 31వ తేదీకి విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకూ కేసు విచారణను సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..