Telangana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి తుమ్మల.. అదేంటంటే?

| Edited By: Velpula Bharath Rao

Oct 16, 2024 | 4:47 PM

త్వరలో రైతు భరోసా కింద ఎకరాకు రూ.7500 చొప్పున అందించబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు. నల్లగొండలోని ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కెట్‌లో ఐకెపీ, పత్తి కొనుగోలు కేంద్రాలను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ప్రారంభించారు.

Telangana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి తుమ్మల.. అదేంటంటే?
Good News For Farmers
Follow us on

త్వరలో రైతు భరోసా కింద ఎకరాకు రూ.7500 చొప్పున అందించబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు. నల్లగొండలోని ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కెట్‌లో ఐకెపీ, పత్తి కొనుగోలు కేంద్రాలను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. రైతాంగానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఏడాది నుండే పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.

త్వరలో ఎకరానికి రూ.7500 చొప్పున రైతు భరోసా ఇస్తామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం విస్మరించిన పంటల బీమా పథకాన్ని, ఈ ఏడాది నుండే అమలు చేస్తామని చెప్పారు. ఈ నెలాఖరు వరకు 2లక్షల లోపు రుణం ఉన్నా నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. వచ్చే నెల నుంచి 2లక్షల పైగా రుణం ఉన్న వారికి దశల వారీగా రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. ఈ ఏడాదే రూ.31వేల కోట్ల రుణమాఫీ చేస్తామని తెలిపారు. వరి, పత్తి రైతులకు ఇబ్బంది కలుగకుండా మద్ధతు ధర మేరకు కొనుగోలు జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు.

తేమ పేరుతో రైతులను అధికారులు ఇబ్బందులు పెట్టవద్దని, రైతులు కూడా తేమ శాతం మేరకు ధాన్యం, పత్తి దిగుబడులు ఉండేలా చూసుకుని మార్కెట్‌కు తీసుకురావాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఐదేళ్లలో 9 లక్షల ఎకరాల్లో ఫామ్ ఆయిల్ సాగు లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి