Telangana Schools reopen: పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 1 నుండి విద్యాసంస్థలు పున:ప్రారంభం కానున్నాయని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీవీ9కి తెలిపారు. మరింత ఆలస్యం అయితే పిల్లలు సైకలాజికల్‌గా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. మౌళిక వసతులు ఏర్పాటు చేసి covid నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహిస్థామని మంత్రి చెప్పారు. ఫిజికల్ తరగతులతో పోలిస్తే ఆన్లైన్ తరగతులు అంత ఎఫెక్ట్ గా ఉండవన్నది అందరూ ఏకీభవించాలన్న మంత్రి.. లోకల్ బాడీ మొత్తం ఇన్వాల్వ్ కావాలని అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు.
పాఠశాలల విషయంలో హెడ్మాస్టర్ లు కూడా లోకల్ గా ఉన్న సర్పంచులను కలవాలని మంత్రి సబిత తెలిపారు. 30 వరకు క్లీనింగ్ పనులు పూర్తి కాకపోతే హెడ్మాస్టర్ లే బాధ్యత వహించాలన్నారు. ఈ నెల 30 వరకు అన్ని స్కూళ్లలో ఉన్న పరిస్థితులపై రిపోర్టు పంపించాలని మంత్రి పేర్కొన్నారు. “ఈసారి పేరెంట్స్ పర్యవేక్షణలో ఐసొలేషన్ రూములు.. ఎక్కువ మంది పిల్లలకు కరోనా వస్తే అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాము. విద్యార్థుల ట్రాన్స్పోర్టేషన్ సమయంలో కూడా అన్ని కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు. ఇంటర్మీడియట్ ఆపై తరగతులకు పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ప్లేస్మెంట్స్ కోల్పోతున్నారు”. అని మంత్రి సబిత వెల్లడించారు.
టీవీ9 అండ్ క్యాబ్ సంయుక్తంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ summit అభినందనీయమన్న మంత్రి.. విద్యార్థులకు విద్యా సంస్థల మధ్య గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేయడానికి ఈ ఈవెంట్ దోహదపడుతుందని మంత్రి అన్నారు. ప్రభుత్వం నుండి కూడా ఒక హెల్ప్ లైన్ పెడితే బాగుంటుందని నిర్ణయించామన్న మంత్రి.. రెండు మూడు రోజుల్లో ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో helpline ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
Read also: Krishna District: పద్దతి మార్చుకోకపోతే తాట తీస్తాం.. రౌడీ షీటర్లకు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్..!