డాక్టర్ అవ్వాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. MBBS, BDS కోర్సుల్లో అడ్మిషన్లకు మరో ఛాన్స్!

Telangana MBBS Admissions 2026-27 : ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు విద్యాశాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తిరిగి స్టార్ట్ చేసినట్టు పేర్కొంది. అర్హుతైన విద్యార్థులు ఈ అవశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచింది. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి..

డాక్టర్ అవ్వాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. MBBS, BDS కోర్సుల్లో అడ్మిషన్లకు మరో ఛాన్స్!
Telangana Mbbs Admissions 2026 27

Edited By:

Updated on: Aug 18, 2026 | 3:13 PM

తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పునఃప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో 2026–27 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తిరిగి ప్రారంభించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన పలు అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు మరో అవకాశం కల్పించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.

నీట్ యూజీ–2026లో నిర్ణీత కటాఫ్ స్కోర్ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి అర్హత పొందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్‌లోడ్ ప్రక్రియ ఆగస్టు 18, 2026 మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆగస్టు 20, 2026 సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.ఇప్పటికే తమ దరఖాస్తులను సమర్పించిన అభ్యర్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని యూనివర్సిటీ స్పష్టం చేసింది.

అభ్యర్థులు ఇతర వివరాల కోసం గతంలో జారీ చేసిన నోటిఫికేషన్, ప్రాస్పెక్టస్‌ను పరిశీలించాలని సూచించింది.
అర్హులైన అభ్యర్థులు https://tsmedadm.tsche.in వెబ్‌సైట్ ద్వారా ఆగస్టు 18, 2026 మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆగస్టు 20, 2026 సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us