AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరివేపాకు కోడి వేపుడు.. ఇలా చేస్తే రుచి జన్మలో మర్చిపోరు!

చికెన్ వేపుడు అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. అందుకే చాలా మంది చికెన్ వేపుడు తింటుంటారు. అయితే ఎప్పుడూ తినే విధంగా కాకుండా, ఇలా కరివేపాకు చికెన్ వేపుడు ప్రిపేర్ చేసి తింటే రుచి అదిరిపోతుందంట. అంతే కాకుండా ఈ టేస్ట్ మీరు జన్మలో మర్చిపోరు. కాగా, ఇప్పుడు మనం రుచికరమైన కరివేపాకు కోడి వేపుడు ఎలా చేయాలో చూసేద్దాం పదండి.

Samatha J
|

Updated on: Sep 29, 2026 | 10:14 AM

Share
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే..  చికెన్ 1 కేజీ,  కరివేపాకు,   పచ్చిమిరపకాయలు,వెల్లుల్లిపాయ రెబ్బలు, కొత్తిమీర,   అల్లం,   ఉల్లిపాయలు,   జీలకర్ర,  లవంగాలు,  ఎండుమిరపకాయలు,  సోంపు,   జాపత్రి,  యాలకులు, మిరియాలు,   దాల్చిన చెక్క,   ధనియాలు,  పసుపు,   ఉప్పు,  నూనె.

1 / 5
కరివేపాకు కోడి వేపుడు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే, ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం ఒక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, అందులో నూనె వేయాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత అందులో ఎండు మిరపకాయలు,జీలకర్ర, లవంగాలు, సోంపు, జావిత్రి, యాలకులు, మిరియాలు, దాల్చినచెక్క, ధనియాలు అన్నీ వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు తీసుకొని మంచిగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత వీటన్నింటిని మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు చికెన్ తీసుకోవాలి. శుభ్రంగా కడిగిన చికెన్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి మంచిగా వేయించుకోవాలి.

3 / 5
 తర్వాత అందులో చికెన్ వేసి మంచిగా ఉడికించుకోవాలి.  ఒక గ్లాసు నీరు పోసి బాగా కలపాలి. మీడియం మంటపై ఎనిమిది నుండి పది నిమిషాల పాటు మూతపెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండికించుకోవాలి.

4 / 5
పది నిమిషాల తర్వాత, చికెన్‌లో కొద్దిగా నీరు ఉండగానే, సిద్ధం చేసుకున్న కరివేపాకు మసాలా పొడిని మూడు భాగాలుగా చేసి, మొదటి భాగాన్ని వేసి రెండు నిమిషాలు బాగా కలపాలి. ఆ తర్వాత రెండో భాగాన్ని, చివరగా మూడో భాగాన్ని కూడా వేసి పొడి అంతా ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. నీరు మొత్తం పోయి, మసాలా పొడి ముక్కలకు బాగా బట్టి, కర్రీ దగ్గర పడే వరకు ఫ్రై ఉడికించుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ కరివేపాకు కోడి వేపుడు రెడీ.

5 / 5
Follow Us
కరివేపాకు కోడి వేపుడు.. ఇలా చేస్తే రుచి జన్మలో మర్చిపోరు!
కరివేపాకు కోడి వేపుడు.. ఇలా చేస్తే రుచి జన్మలో మర్చిపోరు!
మరణాన్ని జయించిన 70 ఏళ్ల బామ్మ! 12 గంటల తర్వాత ఏం జరిగిందంటే?

మైలురాయి + సెంచరీ = విజయం.. కోహ్లీకి సోదరి స్పెషల్ మెసేజ్..!

బాలయ్యలానే టాక్ షోతో దుమ్ములేపనున్న చిరంజీవి.?

తిరుమలకు వెళ్తున్నారా..? అయితే, ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోండి..

చనిపోయిన ప్రియుడు కలలోకి వచ్చి పిలుస్తున్నాడు.. యువతి దారుణ నిర్ణ

కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుకున్న ప్రేమ పాట..

అయ్యో పాపం.. కరెంట్ షాక్‌తో ఆడ చిరుత మృతి! అసలేం జరిగిందంటే..

భారత్ ఖాతాలో మరో పతకం.. మహిళల ట్రాప్ షూటింగ్‌లో మెరిసిన త్రయం

వేడి వేడి అన్నంలోకి.. కారం కారం టమాటా ఉల్లికారం, నోరూరడం గ్యారంటీ