Telangana: మార్చురీకి తీసుకొచ్చిన డెడ్‌బాడీ.. ఇంతలో సీన్ రివర్స్.. డాక్టర్లకు మైండ్ బ్లాంక్!

|

Apr 03, 2023 | 1:54 PM

చనిపోయాడని అనుకున్న వ్యక్తి చివరి నిమిషంలో బతికి వస్తే ఎలా ఉంటుంది. పోస్టుమార్టం కోసం సిద్ధం చేస్తుండగా..

Telangana: మార్చురీకి తీసుకొచ్చిన డెడ్‌బాడీ.. ఇంతలో సీన్ రివర్స్.. డాక్టర్లకు మైండ్ బ్లాంక్!
Representative Image
Follow us on

చనిపోయాడని అనుకున్న వ్యక్తి చివరి నిమిషంలో బతికి వస్తే ఎలా ఉంటుంది. పోస్టుమార్టం కోసం సిద్ధం చేస్తుండగా.. ఒక్కసారిగా కదలికలు వస్తే ఏంటీ పరిస్థితి.. అచ్చం ఇదే జరిగింది. ఈ వింత ఘటన నిజమాబాద్ జిల్లాసుపత్రి మార్చురీలో వెలుగు చూసింది. చనిపోయాడని మార్చురికి తెచ్చిన ఓ వ్యక్తిలో అనూహ్యంగా కదలికలు వచ్చాయి.. దీంతో హుటాహుటీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..

నిజామాబాద్‌ జిల్లా తిర్మన్‌పల్లికి చెందిన అబ్దుల్‌ గఫర్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. మార్గమద్యలోనే మృతి చెందాడని భావించి.. నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. అక్కడే అంతా షాక్‌ తిన్నారు.. పోస్టుమార్టంకు తరలించే క్రమంలో అబ్దుల్‌ నోట్లో పెట్టిన పైపులను తొలగించారు వైద్య సిబ్బంది. అదే సమయరంలో అబ్దుల్‌ గఫర్‌లో కదలికలను గుర్తించారు.. దీంతో షాక్ తిన్న సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన మళ్లీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో గఫర్‌కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.