Lock Down in Telangana: లాక్‌డౌన్ ఎఫెక్ట్.. కేవలం ఐదు గంటల్లోనే రూ. 20 కోట్ల అమ్మకాలు.. మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే..

Lock Down in Telangana: వైన్ షాపుల వద్ద ఊహించని సునామీ వచ్చి పడింది. తండోపతండాలుగా జనాలు వైన్ షాపుల వద్దకు తరలి వచ్చారు.

Lock Down in Telangana: లాక్‌డౌన్ ఎఫెక్ట్.. కేవలం ఐదు గంటల్లోనే రూ. 20 కోట్ల అమ్మకాలు.. మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే..
Good News for Pensioners

Edited By: Team Veegam

Updated on: May 12, 2021 | 11:20 PM

Lock Down in Telangana: వైన్ షాపుల వద్ద ఊహించని సునామీ వచ్చి పడింది. తండోపతండాలుగా జనాలు వైన్ షాపుల వద్దకు తరలి వచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 460 వైన్ షాపుల వద్ద మందు బాబులు భారీగా బారులు తీరారు. తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధిస్తున్నట్లుగా ప్రకటించడమే ఆలస్యం మద్యం ప్రియులు క్షణం కూడా ఆలస్యం చేయకుండా వైన్ షాపుల వద్ద వాలిపోయారు. ఈ దెబ్బకు కేవలం ఐదు గంటల వ్యవధిలోనే రూ. 20 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయి.

మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా 12వ తేదీ నుంచి లాక్‌డౌన్ విధించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన క్షణాల్లోనే మందుబాబులు వైన్ షాపుల వద్ద క్యూ కట్టారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం దుకాణాల వద్ద భారీ రద్దీ నెలకొంది. ఈ ఐదు గంటల వ్యవధిలోనే దాదాపు రూ. 20 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇదిలాఉంటే.. లాక్‌డౌన్‌లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే వైన్ షాపులు తెరిచి ఉంచాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు మద్యం ప్రియులు ఉదయం 6 గంటలకు వైన్ షాపులు తెరవకముందే షాపుల వద్దకు వచ్చి క్యూ కట్టారు.

‘‘రాత్రి కర్ఫ్యూ తమ వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. సాధారణంగా అమ్మకాలు ఎక్కువగా రాత్రి 7 నుండి 9 వరకు నడుస్తాయి. ఆంక్షలు అమలులో ఉండటంతో గత మూడు వారాల్లో ఆదాయం 50 శాతానికి పడిపోయింది. కానీ, మంగళవారం నాడు కస్టమర్లు ఊహించని విధంగా భారీ స్థాయిలో వచ్చారు.’’ అని సికింద్రాబాద్‌లోని ఓ వైన్ షాప్ యజమాని చెప్పుకొచ్చాడు. సాధారణ రోజుల్లో ప్రతీ అవులెట్ ద్వారా రోజుకు 4 నుంచి 5 లక్షల రూపాయల మద్యం అమ్మకాలు జరిగేవని, అయితే కరోనా వైరస్ వ్యాప్తి మద్యం వ్యాపారాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని మరో వైన్ షాపు ఓనర్ తెలిపాడు.

కాగా, ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో మంగళవారం నాడు.. నగరంలో ప్రీమియం బ్రాండ్లను విక్రయించే సూపర్ వైన్ మాల్.. కొన్ని గంటల వ్యవధిలో రూ. 3 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు సమాచారం. అలా.. నగర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపుల్లో జరిగిన దాదాపు రూ. 20 కోట్లకు పైగానే ఉంటుందంటున్నారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో జంట నగరాల్లోని మద్యం దుకాణాలకు నాలుగు గంటల పాటు విశ్రాంతి ఉండకపోవచ్చని వైన్ షాపు నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ‘కొన్ని వందల మంది కార్మికులు, ఇతరులు ఉదయం సమయంలో మద్యం కోసం వైన్ షాపుల వద్ద క్యూ లైన్లలో వేచి ఉండే అవకాశం ఉంది.’ అని ఓ వైన్ షాపు డీలర్ చెప్పుకొచ్చాడు.

ఇదిలాఉంటే.. లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో మద్యం స్టాక్‌ల డెలివరీపై లైసెన్స్‌దారుల్లో గందరగోళం నెలకొంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అవకాశం ఇవ్వడంతో సప్లయ్ ఎలా జరుగుతోందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి ఆందోళనలపై తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. సాధారణ సమయాల్లో పని చేసే డిపోలకు లాక్‌డౌన్ నిబంధనలు వర్తించవన్నారు. ‘తెల్లవారుజామున 4 గంటల నుంచే డిపోల నుంచి స్టాక్‌లను పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. లైసెన్స్‌దారులు తమ తమ షాపుల వద్ద ఉదయం 6 గంటల నుంచి 10 గంటల అన్‌లోడ్ చేసుకోవచ్చు.’ అని సదరు అధికారులు తెలిపారు.

బుధవారం నాడు 26 ఔట్‌లెట్లకు స్టాక్‌లను సరఫరా చేయడానికి ఇండెంట్ ఉందని టిఎస్‌బిసిఎల్ డిపో మేనేజర్ వెల్లడించారు. కొన్ని వైన్ షాపులు మినహా, తమ పరిధిలో ఉన్న బార్, రెస్టారెంట్లు ఏవీ ఆర్డర్లు ఇవ్వలేదని చెప్పారు.

Also read:

Anushka Shetty: ఎన్నో సినిమాలు ఫైన‌ల‌య్యాయి.. కానీ ఒక్క‌టి కూడా ప‌ట్టాలెక్క‌డం లేదు.. ఏంటి స్వీటీ సంగ‌తి..!

Shreyas Iyer Unlikely: గబ్బర్ అభిమానులకు గుడ్ న్యూస్.. శ్రీలంక టూర్‌ నుంచి శ్రేయాస్ అయ్యర్ ఔట్..