Telangana: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న మద్యం ధరలు..! ఒకేసారి ఎంతంటే..?

తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయా..? అంటే అవుననే తెలుస్తోంది. పెరుగుతున్న తయారీ ఖర్చుల కారణంగా మద్యం ధరలను పెంచాలని ప్రభుత్వాన్ని కంపెనీలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా పెంపునకు సిద్దమవుతోంది. అయితే ఎంతవరకు పెరుగుతాయనేది ఇంకా క్లారిటీ రాలేదు.

Telangana: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. పెరగనున్న మద్యం ధరలు..! ఒకేసారి ఎంతంటే..?
Wine Shop

Updated on: Jun 04, 2026 | 5:02 PM

తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్. మందుబాబులకు కిక్కు దిగే వార్త ఇది. అదేంటంటే.. త్వరలో రాష్ట్రంలో మద్యం ధరల పెంపుకు రేవంత్ సర్కార్ సిద్దమవుతోంది. కనీసం 10 శాతం మేర పెంచాలని తయారీ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ధరలు పెంచాలని ప్రభుత్వంపై తయారీదారులు ఎప్పటినుంచో ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ప్రభుత్వం ధరల సవరణకు ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ఎం సునీల్ కిషోర్ జైస్వాల్ అధ్యక్షతన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ సునీల్ శర్మ, చార్టర్డ్ అకౌంటెంట్ నవీన్ రెడ్డి ఈ కమిటీలో ఉన్నారు. ఈ త్రిసభ్య కమిటీ బుధవారం నుంచి మూడు రోజుల పాటు కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది.

త్రిసభ్య కమిటీ ఏర్పాటు

బుధవారం మద్యం తయారీ కంపెనీల ప్రతినిధులు ఈ కమిటీకి ప్రతిపాదనలు సమర్పించారు. మద్యం తయారీకి ఉపయోగించే ప్యాకేజింగ్ మెటిరీయల్స్, ముడి సరుకులతో పాటు రవాణా ఖర్చులు కూడా పెరిగిపోయాయని తమ ప్రతిపాదనల్లో తెలిపారు. దాదాపు 10 శాతం వరకు ధరలు పెంచితే తమకు లాభసాటిగా ఉంటుందని సూచించారు. ఇటీవల అమెరికా-ఇరాన్ యుద్దం వల్ల గాజు బాటిళ్లు, క్యాప్స్ ధరలు పెరిగాయి. ఇక దేశంలో వాణిజ్య సిలిండర్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఈ క్రమంలో తమపై అదనపు భారం పడుతుందని కంపెనీలు చెబుతున్నాయి. ఈ క్రమంలో త్వరలో మద్యం ధరలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. అయితే 10 శాతం వరకు పెంచితే ధరలు భారీగా పెరిగుతాయి. దీని వల్ల ఏపీ, తెలంగాణ మధ్య మద్యం ధరల్లో భారీ వ్యత్యాసాలు ఉంటాయి. దీంతో ఏపీ నుంచి తెలంగాణకు మద్యం అక్రమంగా సరఫరా అయ్యే అవకాశముంటుంది.

త్వరలోనే ధరలు పెంపు..!

సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఏపీ నుంచి మద్యం కొనుగోలు చేసే అవకాశముంటుంది. దీని వల్ల తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తగ్గుతుంది. తెలంగాణకు పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండికొట్టినట్లు అవుతుంది. దీంతో కంపెనీలకు ప్రయోజనకరంగా ఉండటంతో పాటు రాష్ట్ర ఖజానాకు నష్టం జరగకుండా చూడాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో త్రిసభ్య కమిటీ ఎలాంటి సిఫార్సులు చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. మద్యం ధరలు అయితే ఖచ్చితంగా పెరగనుండగా.. కంపెనీల డిమాండ్ కంటే తక్కువ శాతమే ప్రభుత్వం పెంపునకు అనుమతి ఇవ్వనుందని తెలుస్తోంది. దీంతో త్వరలో మందుబాబులకు షాక్ తగలనుందని తెలుస్తోంది.

Follow Us