కొత్త పార్టీపై కే. కవిత కీలక ప్రకటన.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ అంటే?

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కల్వకుంట్ల కవిత పొలిటికల్‌ ఇంపాక్ట్ పరిమితంగానే ఉన్నా, భవిష్యత్‌లో మాత్రం పోటీఇవ్వగల సత్తా ఉందని నిరూపించుకున్నారు. దీంతో భవిష్యత్ రాజకీయ ఎత్తుగడలకు కవిత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కొత్త పార్టీపై క్లారిటీ లేకుండానే మున్సిపల్ బరిలోకి దిగి బోణి కొట్టారు.

కొత్త పార్టీపై కే. కవిత కీలక ప్రకటన.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ అంటే?
Telangana Jagruthi President Kalvakuntla Kavitha

Edited By:

Updated on: Feb 19, 2026 | 7:35 PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కల్వకుంట్ల కవిత పొలిటికల్‌ ఇంపాక్ట్ పరిమితంగానే ఉన్నా, భవిష్యత్‌లో మాత్రం పోటీఇవ్వగల సత్తా ఉందని నిరూపించుకున్నారు. దీంతో భవిష్యత్ రాజకీయ ఎత్తుగడలకు కవిత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కొత్త పార్టీపై క్లారిటీ లేకుండానే మున్సిపల్ బరిలోకి దిగి బోణి కొట్టారు. తాజాగా కొత్త పార్టీ ఏర్పాటుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా చిట్ చాట్‌లో ఆమె మాట్లాడారు.

ఈ ఏడాది మే నెలలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు కవిత ప్రకటించారు. మే మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీ పేరు, గుర్తును ప్రకటిస్తామని ఆమె తెలిపారు. పార్టీ పేరులో తెలంగాణ పేరు ఖచ్చితంగా ఉంటుందని ఆమె చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని, మొదటి ఛాయిస్ సిద్దిపేట, రెండో చాయిస్ బోధన్ అన్నారు. రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట నుంచి తాను స్వయంగా పోటీ చేస్తానని తెలిపారు. మొదటి ఛాయిస్‌ సిద్దిపేట అని కవిత స్పష్టం చేశారు. ప్రస్తుతం సిద్ధిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తెలంగాణలో ఇకపై బీజేపీ ఉండదని, రాష్ట్రంలో మేమే ప్రధాన ప్రతిపక్షం అని కవిత తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. పురపాలక ఎన్నికల జాగృతి కార్యకర్తలు సత్తా చాటారని, పెద్దపల్లి మున్సిపాలిటీలో మేమే ప్రధాన ప్రతిపక్షమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు మాకు గుర్తు వస్తే మా పార్టీపైనే పోటీ చేస్తామన్నారు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ పొత్తుతో పోటీ చేస్తామన్నారు. మా పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలు చాలామంది మాతో టచ్‌లో ఉన్నారని, ఎవరెవరు అనేదీ సందర్భం వచ్చిన్నప్పుడు చెబుతానన్నారు

షర్మిల ఫెయిల్యూర్ లీడర్ కాదు జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షరాలు అని కవిత తెలిపారు. పార్టీలు పెట్టి ఫెయిల్ అయిన మగవారి గురించి ఎందుకు చర్చ చేయరని కవిత నిలదీశారు. ఓన్లీ ఆడవాళ్లనే అంటారా అని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ పెడతా అన్నాడు.. బీజేపీలో చేరాడు.. ఇప్పుడు మళ్లీ పార్టీ అంటున్నాడని గుర్తు చేశారు. తెలంగాణ మా పార్టీ మదర్ బోర్డ్, సామాజిక తెలంగాణ మా పార్టీ లక్ష్యం.. ప్రజల కోణంలో పార్టీ నడుపుతామని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us