Telangana: రేపిస్టులను ఉపేక్షించబోమన్న మంత్రి కేటీఆర్.. చట్టాల్లో మార్పులు చేసి బెయిల్ రాకుండా చేయాలని ట్వీట్

|

Aug 19, 2022 | 10:36 AM

మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. గుజరాత్ లోని సంచలనం సృష్టించిన

Telangana: రేపిస్టులను ఉపేక్షించబోమన్న మంత్రి కేటీఆర్.. చట్టాల్లో మార్పులు చేసి బెయిల్ రాకుండా చేయాలని ట్వీట్
Ktr
Follow us on

Ktr: మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. గుజరాత్ లోని సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో దోషులను రెమిసన్ కింద విడుదల చేయడాన్ని ఇటీవల కేటీఆర్ తప్పు బట్టారు. అయితే దీనిపై బీజేపీ నాయకులతో పాటు నెటిజన్లు స్పందించారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన అత్యాచారం కేసులో ప్రభుత్వం ఏం చేసిందని.. ఆకేసులో నిందితులు బయటే ఉన్నారంటూ కామెంట్స్ చేశారు. ఈకామెంట్లపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

హైదరాబాద్‌లో  ఇటీవల జరిగిన అత్యాచారం కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించే వెర్రి ట్రోలర్స్ కు తానిచ్చే సమాధానం ఇదేనంటూ.. నిందితులను వేగంగా అరెస్టు చేసి జైలుకు పంపామని.. 45 రోజుల తర్వాత, హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది, ఈ రేపిస్టులను చట్ట ప్రకారం శిక్షించే వరకు మేము పోరాడుతామని ట్విట్ చేశారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్, IPC, CrPC లోని లొసుగులు నిందితులు అత్యాచార కేసుల్లో బెయిల్‌పై బయటికి రావడానికి కారణమవుతున్నాయన్నారు. అందుకే ఈ చట్టాలను సవరించాలని తాను డిమాండ్ చేస్తున్నానని తెలిపారు. అత్యాచార కేసుల్లో ఏ ఒక్క నిందితుడికి బెయిల్ రాకూడదని అన్నారు. చట్టాల్లో సవరణ చేసి బెయిల్ రాకుండా చేస్తే.. దోషిగా తేలినప్పుడు మరణశిక్ష వరకు జైలులోనే ఉంటారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..