KTR: కేటీఆర్‌ను త్వరలో వెండితెరపై చూడొచ్చా.? యంగ్‌ మినిస్టర్‌ సమాధానం ఇదే..

KTR: సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే రాజకీయ నాయకుల్లో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ముందు వరుసలో ఉంటారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్‌ చేస్తూనే ఉంటారు. కేవలం రాజకీయాలే కాకుండా సినిమాలు, స్పోర్ట్స్‌...

KTR: కేటీఆర్‌ను త్వరలో వెండితెరపై చూడొచ్చా.? యంగ్‌ మినిస్టర్‌ సమాధానం ఇదే..

Updated on: Aug 05, 2022 | 6:06 PM

KTR: సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే రాజకీయ నాయకుల్లో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ముందు వరుసలో ఉంటారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్‌ చేస్తూనే ఉంటారు. కేవలం రాజకీయాలే కాకుండా సినిమాలు, స్పోర్ట్స్‌ ఇలా సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఇక ప్రస్తుతం కాలి గాయంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మంత్రి తాజాగా ట్విట్టర్‌ వేదికగా #AskKTR పేరుతో నెటిజన్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు పలు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

ఇందులో భాగంగా ఓ అభిమాని ప్రశ్నిస్తూ.. ‘కేటీఆర్‌ సర్‌ మిమ్మల్ని బిగ్‌స్క్రీన్‌పై చూడాలనుకుంటున్నాం. ఏదైనా అవకాశం ఉందా.?’ అని ప్రశ్నించగా.. దానికి మంత్రి బదులిస్తూ.. ‘ఇప్పటివరకూ నా రాజకీయ ప్రసంగాలను చూడకపోతే ‘బిగ్‌స్క్రీన్‌’పై చూడొచ్చు అని సమాధానం ఇచ్చారు. ఇక ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందన్న కేటీఆర్‌.. టీఆర్‌ఎస్‌ నుంచి తర్వాతి సీఎం అభ్యర్థి మీరేనా.? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘కేసీఆర్‌ గారి రూపంలో సమర్థుడైన సీఎం మనకు ఉన్నారు. తెలంగాణ ప్రజల దీవెనలతో ఆయన హ్యాట్రిక్‌ కొడతార’ని చెప్పుకొచ్చారు.

‘భాజపా నాయకులు ప్రచారంలో దూసుకుపోతుంటే తెరాస పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నార’న్న ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించిన కేటీఆర్‌.. ఖాళీ గిన్నెలకు మోత ఎక్కువ అంటూ చమత్కరించారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో యువత రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉందన్న కేటీఆర్‌.. ఎలాంటి నేపథ్యం లేకుండా మన సీఎం సర్‌తో సహా ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. ‘జాతీయ జెండాను వాట్సప్‌ డీపీగా మార్చాలని పీఎం చెప్పడం వల్ల దేశ జీడీపీ పెరుగుతుందా’ అని ఓ నెటిజన్‌ ప్రశ్నకు బదులిస్తూ.. ‘సోషల్‌ మీడియాలో ప్రొఫైల్‌ పిక్‌ మారిస్తే ఏం జరుగుతుంది? జీడీపీ మారితేనే దేశం ముందుకు వెళ్తుంది’అని బదులిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..