Telangana: తెలంగాణలో నిప్పుల వాన.. రాష్ట్ర ఆరోగ్య శాఖ కీలక సూచన

|

May 01, 2024 | 5:43 PM

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. నడినెత్తిన మంట పెట్టినట్టు సెగలు రేపుతున్నాడు. సూర్యుడి విశ్వరూపానికి విలవిల్లాడిపోతున్నారు జనం. ఒకవైపు ఎండలు దంచికొడుతుంటే, ఇంకోవైపు వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్‌. ఈ క్రమంలో తెలంగాణలో ఎల్లో వార్నింగ్‌ ఇచ్చింది వాతావరణశాఖ.

Telangana: తెలంగాణలో నిప్పుల వాన.. రాష్ట్ర ఆరోగ్య శాఖ కీలక సూచన
Heat Wave
Follow us on

మే వచ్చేసింది. భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉదయం 8 దాటాక బయటకు వచ్చే పరిస్థితి లేదు. జనాలు ఉక్కపోత, వడగాలులతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ మరో బాంబ్ పేల్చింది. రాష్ట్రంలో  ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. చాలా ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని.. ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అంశాలతో ప్రభుత్వం ఓ అడ్వైజరీ విడుదల చేసింది. హీట్‌వేవ్ నేపథ్యంలో, మే 1, బుధవారం విడుదల చేసిన అలెర్ట్ ప్రకారం..  ప్రజలు మధ్యాహ్నం 12 నుంచి  3 గంటల మధ్య ఎండలో బయటికి రాకుండా ఉండాలని సూచించింది.

ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బోనేటేడ్ శీతల పానీయాలు, పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది, ఎందుకంటే అవి ఎక్కువ శరీర ద్రవాలను కోల్పోవటానికి లేదా.. కడుపులో తిమ్మిరికి కారణం కావొచ్చని తెలిపింది. ఈ ఎండల కారణంగా  శిశువులు, చిన్నపిల్లలు, బయట ప్రాంతాల్లో పనిచేసే వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు, మానసిక వ్యాధులు ఉన్నవారు, శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, ముఖ్యంగా గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని.. లేని పరిస్థితుల్లో తీవ్రమైన ఒత్తిడి, వేడి-సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తెలిపింది.

దిగువ ఇచ్చిన సంకేతాలు ఏవైనా కనిపిస్తే, వారు తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలని పేర్కొంది

  • అపస్మారక స్థితి, గందరగోళం, ఆందోళన, చిరాకు, బ్యాలెన్స్ కోల్పోవడం, మూర్ఛ
  •  కోమా
  • చర్మం వేడెక్కడం, పొడి బారం
  • శరీర ఉష్ణోగ్రత ≥40 °C లేదా 104 °F
  • దడ పుట్టించే తలనొప్పి
  • ఆందోళన, మైకము, తల తిరగడం
  • కండరాల బలహీనత లేదా తిమ్మిరి
  • వికారం, వాంతులు
  • హార్ట్ బీట్ పెరగడం
  • శ్వాస తీసుకునే వేగం పెరగడం, పల్స్ పడిపోవడం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..