Telangana High Court: తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ల ధరల పెంచేందుకు థియేటర్లకు ధర్మాసనం అనుమతిచ్చింది. థియేటర్ల యాజమాన్యాలు ఇటీవల టికెట్ల ధరల పెంపునకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. అఖండ, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప తదితర బడ్జెట్ సినిమాలకు ధరలు పెంచుతామని థియేటర్ల యాజమన్యాలు తెలిపాయి. ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచేందుకు అనుమతివ్వాలంటూ విజ్ఞప్తి చేశాయి. అయితే.. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో థియేటర్ల యాజమాన్యాలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి. అయితే.. థియేటర్ల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలను వెలువరించింది. ఒక్కో టికెట్‌పై రూ.50 మేర పెంచేందుకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే.. విచారణ సందర్భంగా థియేటర్ల తరపున న్యాయవాది.. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించడం లేదంటూ పేర్కొన్నారు. కాగా.. హైకోర్టు ఉత్తర్వులతో భారీ సినిమాల టికెట్ల రేట్లు పెరగనున్నాయి. అయితే.. ఇప్పటికే ఉన్న ధరలకు అదనంగా మరో రూ.50 వరకు ధరలు పెరగనున్నాయి.
Also Read: