Trs Land Issue: టీఆర్ఎస్ అధినేతకు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు.. ఏ విషయంలోనంటే..!

Trs Land Issue: టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాల కోసం జిల్లాల్లో..

Trs Land Issue: టీఆర్ఎస్ అధినేతకు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు.. ఏ విషయంలోనంటే..!
Telangana High Court
Follow us

|

Updated on: Jun 24, 2022 | 8:27 AM

Trs Land Issue: టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాల కోసం జిల్లాల్లో భూమి కేటాయింపుపై జరిగిన విచారణలో భాగంగా ఈ నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ కార్యాలయాలకు భూ కేటాయింపులపై, రిటైర్డ్‌ ఉద్యోగి మహేశ్వర్‌రాజ్‌ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అలాగే, టీఆర్‌ఎస్ హైదరాబాద్‌ ఆఫీస్‌ కోసం బంజారాహిల్స్‌లో 4వేల 935 గజాలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు పిటిషనర్. అత్యంత ఖరీదైన భూమిని గజం కేవలం 100 రూపాయలకే ఇవ్వడంపై పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, కేసీఆర్‌, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డితో పాటు సీఎస్‌, సీసీఎల్‌ఏ, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, జిల్లా కేంద్రాల్లో వంద రూపాయలకు గజం చొప్పున ఎకరానికి మించకుండా స్థలం కేటాయించేందుకు, 2018లో ఆగస్టు 16న జారీ చేసిన జీవో రాజ్యాంగ విరుద్ధమని, పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. దీంతో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విచారణలో భాగంగానే కేసీఆర్‌కు కూడా నోటీసులు ఇచ్చింది. అయితే, కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడం తెలంగాణలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
ఆ పెట్టుబడి పథకంతో అదిరే లాభాలు.. ఎఫ్‌డీ కంటే సూపర్ రిటర్న్స్
ఆ పెట్టుబడి పథకంతో అదిరే లాభాలు.. ఎఫ్‌డీ కంటే సూపర్ రిటర్న్స్
ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
మరో సరికొత్త రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్‌గా
మరో సరికొత్త రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్‌గా
తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..
తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..
బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లకు గట్టి పోటీ
బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లకు గట్టి పోటీ
మైలేజ్ ఆలోచించే కారు కొంటున్నారా..? ఆ కార్లల్లో ప్రధాన తేడాలివే.!
మైలేజ్ ఆలోచించే కారు కొంటున్నారా..? ఆ కార్లల్లో ప్రధాన తేడాలివే.!
పాకిస్థానీయులకు వైద్య సహాయం అందించిన భారత నావీ
పాకిస్థానీయులకు వైద్య సహాయం అందించిన భారత నావీ
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయపడిన రోహిత్..
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయపడిన రోహిత్..
ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో..ఇది కాదా అభిమానులకు కావాల్సింది
ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో..ఇది కాదా అభిమానులకు కావాల్సింది