Harish Rao: నేడు ఆదిలాబాద్‌కు మంత్రి హరీష్‌ రావు.. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్న మంత్రి..

|

Mar 03, 2022 | 6:45 AM

Harish Rao: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక మంత్రి హరీష్‌ రావు గురువారం ఆదిలాబాద్‌లో పర్యటించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో రెండురోజుల టూర్‌లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి...

Harish Rao: నేడు ఆదిలాబాద్‌కు మంత్రి హరీష్‌ రావు.. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్న మంత్రి..
Harish Rao Adilabad Tour
Follow us on

Harish Rao: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక మంత్రి హరీష్‌ రావు గురువారం ఆదిలాబాద్‌లో పర్యటించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో రెండురోజుల టూర్‌లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. మొదట హైదరాబాద్ నుంచి నేరుగా నిర్మల్ జిల్లా బాసరకు చేరుకొని శ్రీ జ్జాన సరస్వతి దేవిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తర్వాత ముధోల్‌ 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.

ఇక ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో రిమ్స్‌ ఆసుపత్రికి అనుబంధంగా నిర్మించిన సూపర్‌ స్పెషలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్నారు మంత్రి. ఎన్నో అధునాతన సదుపాయాలతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఈ ఆసుపత్రి వివరాలను తెలియజేస్తూ హరీష్‌ స్వయంగా ట్విట్‌ చేశారు. 210 పడకల ఆసుపత్రికి సంబంధించిన ఫోటోలను పోస్ట్‌ చేసిన మంత్రి.. ‘సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో నేను ఆదిలాబాద్‌లో రిమ్స్‌కు అనుబంధంగా నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్నాను. అలాగే రేడియాలజీ ల్యాబ్‌కు భూమి పూజ చేయనున్నాను. 210 బెడ్స్‌తో కూడిన ఈ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆదిలాబాద్‌ ప్రజల ఆరోగ్య అవసరాల కోసం 42 ఐసీయూలు, 8 స్పెషాలిటీ వింగ్స్‌ ఏర్పాటు చేశాం’ అని హరీష్‌ రావు ట్వీట్‌ చేశారు.

Also Read: కచ్చా బాదం సింగర్‌ కోసం సినీ ప్రముఖులు క్యూ.. ఇప్పటికీ నెట్టింట దూసుకుపోతున్న కచ్చాబాదమ్‌ సాంగ్‌.. వీడియో

Big News Big Debate Live: రష్యా ఓడినట్టా..? గెలిచినట్టా..? బైడెన్‌ వార్నింగ్‌కు పుతిన్‌ భయపడతారా..?(వీడియో)

అర్థరాత్రి దాకా మద్యం తాగి.. మత్తులో భర్తను చంపి.. ఆఖరుకు