Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చాయా..? లేదా..? మొబైల్ నెంబర్‌తో ఈజీగా చెక్ చేసుకోండిలా..

రైతు భరోసా కోసం తెలంగాణ ప్రజలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు అకౌంట్లో పడతాయా అని నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు వారికి శుభవార్త అందింది. నేడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రైతు భరోసా పథకం సొమ్మును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు.

Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చాయా..? లేదా..? మొబైల్ నెంబర్‌తో ఈజీగా చెక్ చేసుకోండిలా..
Rythu Bharosa

Updated on: Mar 22, 2026 | 3:00 PM

తెలంగాణలోని రైతులకు భారీ గుడ్ న్యూస్. ఆదివారం రైతు భరోసా తొలి విడత సొమ్ము రైతుల ఖాతాల్లో రేవంత్ సర్కార్ జమ చేయనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మొదటి విడత నగదును లబ్దిదారుల ఖాతాల్లోకి విడుదల చేయనన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు పాల్గొననున్నారు. తొలి విడతలో మొత్తం 73 లక్షల మంది రైతులకు సాయం అందనుంది. అంటే రూ.3,590 కోట్లను రైతుల బ్యాంక్ ఖాతాల్లో వేయనున్నారు. రైతు భరోసా లబ్దిదారులందరికీ తొలి ఎకరానికి రూ.6 వేలు  జమ కానున్నాయి. ఈ సొమ్ము మీకు వచ్చిందా.. లేదా అనేది స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అదెలానో ఇందులో చూద్దాం.

స్టేటస్ చెక్ చేసుకోండిలా..

-రైతు భరోసా అధికారిక వెబ్ సైట్ https://www.rythubharosa.telangana.gov.in/ ఓపెన్ చేయండి

-హోమ్ పేజీలో కుడివైపు మూలన ఉండే లాగిన్ అనే ఆప్షన్ ఎంచుకోండి

-లాగిన్ విత్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్‌ను టిక్ చేయండి

-మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీని నిర్ధారించండి

-పేమెంట్ స్టేటస్‌ బటన్‌పై క్లిక్ చేయండి

-ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి

-రైతు భరోసా స్టేటస్ స్క్రీన్‌పై క్లిక్ చేయండి

-మీకు డబ్బులు అందాయా.. లేదా అనే విషయం అక్కడ తెలుసుకోవచ్చు.

సోమవారం రైతుల ఖాతాల్లో జమ..

ఆదివారం నగదు జమ చేసినా బ్యాంకులకు సెలవు దినం కావడంతో సోమవారం రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ అవుతాయి. ముందుగా ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు జమ అవుతాయి. బ్యాంకులు వాటిని రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. ఆదివారం సెలవు కావడంతో సోమవారం రైతులు నగదు పొందుతారు. ఇక 20 రోజుల తర్వాత రెండో విడత కింద రూ.2650 కోట్లు రిలీజ్ చేయనుండగా.. మూడో విడతలో రూ.2760 కోట్లు విడుదల చేస్తారు. తెలంగాణలో 24.32 లక్షల మంది ఎకరం వరకు భూమి కలిగి ఉండగా.. 48.68 లక్షల మంది ఎకరం కంటే ఎక్కువ కలిగి ఉన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల నర్మెటలో ఆయిల్ ఫామ్ కర్మాగారం రేవంత్ ప్రారంభించనున్నారు. దాదాపు రూ.300 కోట్లతో దీనిని నిర్మించారు. దీని వల్ల ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు లబ్ది చేకూరనుంది. 18 జిల్లాల రైతులు దీని వల్ల ప్రయోజనం పొందనున్నారు. ఉత్తర, దక్షిణ తెలంగాణలోని రైతులకు ఈ కర్మాగారం ఏర్పాటుతో ఉపయోగం జరగనుంది.

Follow Us