Telangana: పేదలకు పండగలాంటి వార్త.. భూమి లేని కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు

భూమిలేని నిరుపేద కుటుంబాలకు తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం గుడ్​న్యూస్ చెప్పింది. పేద కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్న హామీని ఈనెల 28 నుంచి కాంగ్రెస్​ సర్కారు అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Telangana: పేదలకు పండగలాంటి వార్త..  భూమి లేని కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు
Mallu Bhatti Vikramarka

Updated on: Dec 16, 2024 | 8:46 PM

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.  భూమి లేని నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు రెడీ అయింది.  ఏడాదికి రూ.12 వేల చొప్పున చెల్లించే స్కీమ్‌ను డిసెంబర్ నుంచే అమలు చేయనుంది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబరు 28న ఈ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. ఏడాదిలో రెండు విడతలుగా అందించే ఈ డబ్బులో తొలి విడతగా రూ.6 వేల మొత్తాన్ని ఆ తేదీన లబ్ధిదారుల అకౌంట్లో వేస్తామని భట్టి ప్రకటించారు. ఇక వచ్చే సంక్రాంతి నుంచి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు, వ్యవసాయం కోసం నేరుగా రూ.50,953 కోట్లు ఖర్చు చేసిందన్నారు భట్టి.

సంక్రాంతి తర్వాత కొత్త రేషన్‌ కార్డులు జారీ.. 

సంక్రాంతి తర్వాత కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శాసనమండలి వేదికగా ప్రకటించారు. కొత్తగా 36 లక్షల మందికి ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. అర్హులకు ఇప్పుడిచ్చే 6 కిలోలతో పాటు సన్నబియ్యం అందజేస్తామన్నారు. రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా ఎలక్ట్రానిక్ చిప్‌లు ఏర్పాటు చేసి ఇవ్వబోతున్నట్లు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..