Raitu Bharosa: అన్నదాతలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. రైతు భరోసాకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి ఎప్పుడంటే?

రాష్ట్రంలోని రైతులకు మున్సిపల్ ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుంది. రైతు భరోసా పేరుతో ప్రభుత్వం రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

Raitu Bharosa: అన్నదాతలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. రైతు భరోసాకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి ఎప్పుడంటే?
Telangana Raitu Bharosa

Updated on: Feb 09, 2026 | 11:41 AM

మున్సిపల్‌ ఎన్నికల ముందు రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. పోలింగ్‌కు ముందే రైతులకు తీపి కబురు చెప్పాలని డిసైడ్ అయ్యింది. రైతుల ఖాతాల్లో రైలు భరోసా నిధులు జమ చేసేందుకు కార్యచరణ సిద్ధం చేస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఎన్నికలకు ముందే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

మున్సిపల్ ఎన్నికల ముందు ఓటర్లను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ మేరకు బహిరంగ మార్కెట్ నుంచి భారీగా నిధుల సమీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రూ.9వేల కోట్ల రుణం కోసం ప్రభుత్వం ఆర్బీఐకి ఇండెంటు పెట్టినట్టు తెలుస్తోంది. 13 ఏళ్ల నుంచి 27 ఏళ్ల కాల పరిమితితో మొత్తం రూ.9వేల కోట్ల మేర రుణాలను తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

అన్ని అనుకున్నట్టు జరిగిదే ఈ నెల 10వ తేదీన ఆర్‌బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా ఈ నిధులు ప్రభుత్వ ఖజానాలో జమ కానున్నాయి. అనంతరం ప్రభుత్వ ఖాతాల నుంచి ఈ సోమ్ము నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.