Governor Tamilisai Mahila darbar: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్‌లో ఈ రోజు మహిళా దర్బార్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో భద్రత, సామాజిక సమస్యలపై చర్చించనున్నారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై ట్విట్ చేసి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మహిళా దర్బార్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహిళల గొంతును, ఆవేదనను వినాలనే లక్ష్యంతో మహిళా దర్బార్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళల భద్రత, శ్రేయస్సుతోపాటు వ్యక్తిగత, సామాజిక సమస్యలపై మహిళలు తమ మనస్సులోని ఆవేదనను తెలియజేయనున్నారని పేర్కొన్నారు. అంతకుముందు మహిళా దర్బార్‌కు హాజరై గవర్నర్‌ను కలవాలనుకునే మహిళలు 040 23310521 నెంబర్ కు ఫోన్ చేసి.. లేదా rajbhavan-hyd@gov.in ఐడీకి మెయిల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చని పేర్కొన్న విషయం తెలిసిందే.
దీనికి విపరీతమైన స్పందన లభించిందని గవర్నర్ తమిళిసై ట్విట్ చేశారు. మహిళల నుంచి 300కు పైగా వినతులు అందాయని.. వారిని కలిసేందుకు.. బాధితుల కన్నీళ్లు తుడవడానికి ఆత్రంగా ఎదురు చూస్తున్నానంటూ తమిళిసై ట్విట్‌లో పేర్కొన్నారు.
Received overwhelming response
by way of requests from women of
all walks of life.
More than 300 requests were received.
Eagerly looking forward
to meet them and wipe their tears.#Mahiladarbar#womenempowerment #Telangana pic.twitter.com/AFOkPQmkni— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) June 10, 2022
గవర్నర్ మహిళా దర్బార్ కార్యక్రమం ఇలా..
మధ్యాహ్నం 12 గంటలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గవర్నర్‌ను కలవననున్నారు.
మధ్యాహ్నం 12.10 గంటలకు మహిళా దర్బార్ కార్యక్రమం జరగనుంది.
మధ్యాహ్నం 1.30 గంటలకు వినతులను స్వీకరించనున్నారు.
Today’s Engagements in #Hyderabad. pic.twitter.com/SxenwiZElp
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) June 10, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..