తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆమె… గవర్నర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ప్రధానికి వివరించినట్లు సమాచారం. ఆ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ కానున్నారు.