Telangana: ఆ రెండు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దు.. కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు..!

|

May 11, 2022 | 8:06 PM

Telangana: కర్ణాటక రాష్ట్రం చేపట్టిన అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కేంద్ర జల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం..

Telangana: ఆ రెండు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దు.. కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు..!
Telangana
Follow us on

Telangana: కర్ణాటక రాష్ట్రం చేపట్టిన అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కేంద్ర జల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్.. ప్రాజెక్టు అప్రైజల్ డైరెక్టరేట్‌కు లేఖ రాశారు. ఆ రెండు ప్రాజెక్టులకు అనుమతులు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. అంతర్ రాష్ట్ర అంశాలు, ట్రైబ్యునల్ తీర్పులను పరిగణనలోకి తీసుకోకుండా అనుమతులు ఇవ్వరాదని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. రెండు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం ద్వారా తుంగభద్ర నుంచి ప్రవాహాలు భారీగా తగ్గుతాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అప్పర్ భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులకు బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులు చేయలేదని తెలంగాణ సర్కార్ రాసిన లేఖలో పేర్కొన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కేటాయింపులు చేసినప్పటికీ.. దానికి సంబంధించిన పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేసింది. అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే సమయంలో దిగువ రాష్ట్రాల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని సెంట్రల్ ప్రాజెక్టు అప్రైజల్ డైరెక్టరేట్‌ను తెలంగాణ సర్కార్ కోరింది.