Telangana Government: పండుగ వేళ తెలంగాణలో మరో కొత్త పథకం.. అందరికీ ఉచితంగా కిట్.. 22 రకాల వస్తువులు..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి సందర్భంగా కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల కోసం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా విద్యార్థులందరికీ కిట్ అందించనున్నారు. ఇందులో 22 వస్తువులు ఉండనున్నాయి.

Telangana Government: పండుగ వేళ తెలంగాణలో మరో కొత్త పథకం.. అందరికీ ఉచితంగా కిట్.. 22 రకాల వస్తువులు..
Telangana Government

Updated on: Jan 12, 2026 | 9:45 PM

తెలంగాణలో విద్యార్థులకు సీఎం రేవంత్ శుభవార్త అందించారు. ప్రభుత్వ స్కూల్స్‌ విద్యార్థుల కోసం మరో కొత్త పథకాన్ని ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లల్లో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. పిల్లలకు ఉపయోగపడేలా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా సీఎం రేవంత్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుకునే విద్యార్థులకు కిట్ అందించనున్నట్లు సీఎం ప్రకటించారు. 22 వస్తువులతో ఈ కిట్ ఉండనుంది. ఈ కిట్‌లో విద్యార్థులకు అవసరమైన వస్తువులన్నీ ఉండనున్నాయి. ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కిట్ ఎప్పుడు ఇస్తారంటే..?

వేసవి సెలవుల తర్వాత గవర్నమెంట్ స్కూల్స్‌లోని విద్యార్థులందరికీ ఈ కిట్లు అందించనున్నారు. సమ్మర్ హాలీడేస్ తర్వాత స్కూల్స్ ఓపెన్ అయ్యేలోపు వీటిని విద్యార్థులకు అందించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. కిట్ నాణ్యత విషయంలో అసలు రాజీ పడొద్దని, మంచి క్వాలిటీ కలిగిన వస్తువులు అందించాలని తెలిపారు. విద్యార్థులపై పెట్టే ఖర్చుకు వెనుకాడవద్దని, ప్రభుత్వ, రెసిడెన్షియల్ స్కైూళ్ల పెండింగ్ బల్లులు అందించాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల కోసం ఎంత ఖర్చు అయినా పెట్టేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ప్రభుత్వ స్కూల్స్‌లో ప్రమాణాలను పెంచి ప్రైవేట్ స్కూల్స్‌కు ధీటుగా మారుస్తామన్నారు.

కిట్‌లో ఏవేవి ఉంటాయంటే..?

స్కూల్ పిల్లలకు అందించే కిట్‌లో 22 రకాల వస్తువులు ఉంటాయి. విద్యార్థులకు ఉపయోగపడే యూనిఫామ్, షూస్, బ్యాగ్, బుక్స్, బెల్ట్, టై, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్, షార్ట్‌నర్, వాటర్ బాటిల్ వంటివి ఉంటాయి. వీటిన్నింటిని కిట్‌లో చేర్చాలని రేవంత్ ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లల్లో చేరే ప్రతీ విద్యార్థికి ఈ కిట్ ఉచితంగా అందించనున్నారు. దీని వల్ల విద్యార్థులు సొంతగా నోట్ బుక్స్, బ్యాగులు వంటివి కొనుగోలు చేయల్సిన అవసరం ఉండదు. దీని వల్ల తల్లిదండ్రులకు భారం తగ్గనుంది.