Telangana: మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే..

|

Mar 07, 2022 | 5:09 PM

Telangana: తెలంగాణ ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగినులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని

Telangana: మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే..
Telangana
Follow us on

Telangana: తెలంగాణ ప్రభుత్వంలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగినులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు దినం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేరిట జీవో జారీ చేసిన సర్కార్.. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు రేపు అనగా మార్చి 8వ తేదీన సెలవు ఇస్తున్నట్లు పేర్కొంది. ఇదిలాఉంటే, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా మహిళలకు ప్రత్యేక సెలవు ఇస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా సెలవు ప్రకటించింది.

ఇదిలాఉంటే.. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా టీఎస్ఆర్టీసీ మ‌హిళ‌ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో మ‌హిళ‌ల కోసం పీక్ అవ‌ర్స్‌లో నాలుగు ప్రత్యేక ట్రిప్పుల‌ను న‌డ‌ప‌నుంది. ఆ ప్రత్యేక బ‌స్సుల్లో 60 ఏళ్లు పైబ‌డిన మ‌హిళ‌లు మార్చి 8న సంబంధిత ఐడీని చూపించి.. ఉచితంగా ప్రయాణం చేయవ‌చ్చని పేర్కొంది. అలాగే.. రాష్ట్రంలోని అన్ని బ‌స్ స్టేష‌న్లలో.. మహిళా పారిశ్రామికవేత్తలు, ఎన్‌హెచ్‌జీ లేదా డ్వాక్రా గ్రూప్‌ల ద్వారా ఉత్పత్తులు సేల్స్ కోసం ఉచిత స్టాల్స్, స్పేసెస్‌ను మార్చి 31వ తేదీ వరకు ఉచితంగా అందించాలని సంస్థ నిర్ణయించింది. మహిళలకు ఉచిత హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణను కూడా సంస్థ క‌ల్పించ‌నుంది. టీఎస్ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా 30 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఆసక్తి గల మహిళలకు 30 రోజుల పాటు ఉచిత హెవీ మోటర్ వెహికిల్ శిక్షణ అందించాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. ఆసక్తి గల మహిళలు 31 మార్చి 2022లోపు తమ పేర్లను దగ్గర్లోని డిపోలో నమోదు చేసుకోవచ్చు. శిక్షణ పొందిన మహిళలకు జిల్లా కేంద్రంలోని సంబంధిత శిక్షణ కేంద్రాలలో సర్టిఫికెట్లు కూడా అంద‌జేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు తప్పనిసరిగా ఎల్ఎంవీ లైసెన్స్ కనీస 2 సంవత్సరాలు కలిగి ఉండాలి, కోర్సులో చేరడానికి ముందు ఆర్టీఏ నుంచి ల‌ర్నర్ లైసెన్స్ పొంది ఉండాలి.

Also read:

Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‎ గౌడ్‎ హత్యకు కుట్ర కేసు.. మరో నాలుగు రోజుల కస్టడికి నిందితులు

Andhra Pradesh: పిల్లే కదా అని లైట్ తీసుకోకండి.. కరిస్తే ప్రాణాలు ఫట్.. ఇద్దరు మహిళలు, ఓ కుక్క బలి

Summer Tips: సమ్మర్‌లో శక్తినిచ్చే పండ్ల రసాలు.. అద్భుతమైన ప్రయోజనాలు..!