తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై రూ.500లకే గ్యాస్ సిలిండర్.. నిధులు విడుదల చేసిన ప్రభుత్వం..

అయితే, మహాలక్ష్మి పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది.. రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి రూ.80 కోట్ల విడుదలకు అనుమతిస్తూ పౌరసరఫరాల శాఖ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రూ.500 సిలిండర్‌ పథకాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై రూ.500లకే గ్యాస్ సిలిండర్.. నిధులు విడుదల చేసిన ప్రభుత్వం..
Gas Cylinder

Updated on: Feb 25, 2024 | 12:24 PM

తెలంగాణలో మరో రెండు గ్యారంటీల అమలుకు సిద్ధమైన సర్కార్.. అందుకు అవసరమైన నిధులను కూడా రిలీజ్ చేస్తోంది. మహాలక్ష్మిలో భాగంగా.. 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకంలో భాగంగా.. 200 యూనిట్లలోపు వాడే వారికి ఉచిత కరెంట్ పథకాలను ప్రారంభించేందుకు రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమవుతుతోంది. చేవెళ్ల వేదికగా.. భారీ బహిరంగ సభ నిర్వహించి, ప్రియాంక గాంధీని పిలిచి.. ఈ రెండు గ్యారంటీలకు శ్రీకారం చుట్టబోతోంది తెలంగాణ సర్కార్. తెల్లరేషన్ కార్డు ఉన్నవారందరికీ.. ఈ రెండు పథకాలు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

అయితే, మహాలక్ష్మి పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది.. రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి రూ.80 కోట్ల విడుదలకు అనుమతిస్తూ పౌరసరఫరాల శాఖ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రూ.500 సిలిండర్‌ పథకాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పథకానికి నిధుల విడుదలకు అనుమతిస్తూ పౌరసరఫరాల శాఖ పాలనాపరమైన ఉత్తర్వులిచ్చింది.

సబ్సిడీ గ్యాస్‌ అర్హతకు సమస్యలు..

అయితే, మహాలక్ష్మి గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి 40 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులు అర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వం ఇటీవల చెప్పింది.. అయితే సబ్సిడీ వంట గ్యాస్‌ స్కీంకు రేషన్‌కార్డు కు లింకు పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఆహార భద్రత (రేషన్‌) కార్డులు కలిగిన నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్‌ సిలిండర్లు పొందేందుకు అర్హులు.. అయితే, వంటగ్యాస్‌ కనెక్షన్‌దారుల్లో సగానికి పైగా కుటుంబాలకు రేషన్‌ కార్డులు లేవు.. ముఖ్యంగా గత పదేళ్లలో అనేక కుటుంబాల్లోని సభ్యులు వివాహాలతో వేరుపడడం, కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయకపోవడంతో కార్డులు లేని కుటుంబాల సంఖ్య బాగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అది సబ్సిడీ గ్యాస్‌ అర్హతకు సమస్యగా మారిందంటున్నారు. అంతేకాకుండా.. ప్రధాన మంత్రి ఉజ్వల కల్యాణ్‌ యోజన పథకం లబ్దిదారులకు ఈ పథకం వర్తిస్తుందా లేదా.. అన్నది కూడా తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us