Telangana: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి 30 శాతం పెరిగిన ఇన్సెంటీవ్స్.. పూర్తివివరాలివే..

|

Jan 06, 2022 | 11:48 AM

Telangana: ఆశావర్కర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి నెలవారిగా ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. వారికి 30 శాతం పెరిగిన ఇన్సెంటీవ్స్.. పూర్తివివరాలివే..
Telangana
Follow us on

Telangana: ఆశావర్కర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి నెలవారిగా ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న ఆశా వర్కర్లకు ఇస్నోన్న ఇన్సెంటీవ్స్‌ని 30 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఉత్తర్వులతో ఆశా వర్కర్ల నెలవారీ జీతం 2,250 పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆశా వర్కర్లు తమ నెల వారీ జీతం 7,500 అందుకుంటుండగా.. పెంచిన ఇన్సెంటీవ్స్‌తో వారికి రూ. 9,750 జీతం అందనుంది. కాగా పెంచిన ఇన్సెంటీవ్స్‌ని గతేడాది జూన్ నెల నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, నేషనల్ హెల్త్ మిషన్ కింద పని చేస్తున్న ఆశా వర్కర్లందరికీ ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

Also read:

Delhi Fire breaks: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది..

Road Accident: ఘోర ప్రమాదం..బస్సు.. గ్యాస్ సిలెండర్ లారీ ఢీ.. 17 మంది మృతి..భారీ సంఖ్యలో క్షతగాత్రులు!

CSIR UGC NET అభ్యర్థులకు గమనిక.. కరెక్షన్ విండో ఓపెన్ చేసిన NTA.. జనవరి 9న మార్పులకు అవకాశం..