Telangana: తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం.. మారనున్న రూల్స్

తెలంగాణ ప్రభుత్వం సెక్రటేరియట్ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి కొత్త ఐడీ కార్డులను అందిస్తోంది. అందులో క్యూఆర్ కోడ్, చిప్ వంటివి ఉంటాయి. ఇటీవల నకిలీ ఉద్యోగులు చలామణి అవుతున్నారు. వీరికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Telangana: తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం.. మారనున్న రూల్స్
Telangana Cm Revanth Reddy

Updated on: Jan 01, 2026 | 10:29 PM

కొత్త సంవత్సరం వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సెక్రటేరియట్‌లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి అనూహ్య నిర్ణయం ఒకటి అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరికీ కొత్త ఐడీ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ నూతన ఐడీ కార్డులపై క్యూఆర్ కోడ్‌తో పాటు మైక్రో చిప్, ఎంప్లాయి నెంబర్, పేరు, ఫొటో వంటి వివరాలు ఉంటాయి. అలాగే సచివాలయం, తెలంగాణ తల్లి విగ్రహం ఫొటో వంటిని ముద్రించి ఈ ఐడీ కార్డులను తయారుచేసింది. సెక్రటేరియట్‌లో పనిచేసే ప్రతీ ఉద్యోగికి ఈ కొత్త ఐడీ కార్డులు అందిస్తున్నారు.

ప్రస్తుతం సచివాలయంలో 1300 మంది రెగ్యూలర్ ఉద్యోగులు పనిచేస్తుండగా.. 300 మంది క్లాస్-4 ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరూ కలిసి 1600 మంది ఉన్నారు. రోజూ సెక్రటేరియట్‌కు వచ్చే వీరందరికీ నూతన ఐడీ కార్డులు ఇస్తున్నారు. ఈ ప్రత్యేక ఐడీ కార్డుల ద్వారా సెక్రటేరియట్ ఉద్యోగులను సులవుగా ఎవరైనా గుర్తు పట్టవచ్చు. ఇటీవల సచివాలయంలో పనిచేస్తున్నామంటూ కొంతమంది నకిలీ ఉద్యోగులు లోపలికి ప్రవేశిస్తున్నారు. దీని వల్ల సచివాలయంతో పాటు అక్కడి ఉద్యోగుల భద్రతకు కూడా ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల ఇలాంటి నకిలీ ఉద్యోగుల బెడద మరింతగా ఎక్కువగా ఉంది. దీంతో వారికి చెక్ పెట్టేందుకు ఈ కొత్త ఐడీ సిస్టమ్ తీసుకున్నారు.

కొంతమంది నకిలీ ఐడీ కార్డులు సృష్టించి సెక్రటేరియట్ ఉద్యోగులమని చెప్పుకుంటూ లోపలికి ప్రవేశిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక ఐడీ కార్డులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇటీవల సెక్రటేరియట్‌లో ఉద్యోగుల కోసం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో క్యూఆర్ కోడ్, చిప్‌తో కూడిన టెక్నాలజీతో రూపొదిద్దుకున్న కార్డులను ప్రశేపెట్టారు.