Telangana: తెలంగాణలోని రైతులకు అదిరిపోయే సూపర్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు వచ్చేశాయి.. చెక్ చేసుకున్నారా..?

తెలంగాణలోని రైతులకు తీపికబురు. ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న సేకరిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మందికిపైగా రైతులు మొక్కజొన్న విక్రయించారు. ఈ రైతులకు రేవంత్ సర్కార్ నిధులు విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Telangana: తెలంగాణలోని రైతులకు అదిరిపోయే సూపర్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు వచ్చేశాయి.. చెక్ చేసుకున్నారా..?
Telangana

Updated on: May 29, 2026 | 9:01 AM

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేస్తోంది. అందులో భాగంగా మొక్కజొన్న రైతుల అకౌంట్లో రేవంత్ సర్కార్ డబ్బులు జమ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న విక్రయించిన రైతులకు నిధులు బదిలీ చేసింది. దాదాపు లక్షల మంది రైతులకు రూ.1,173 కోట్లు అందించింది. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్నను కొనుగోలు చేస్తోంది. క్వింటాకు రూ.2,400 మద్దతు ధర అందిస్తోంది. 338 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. వీటి ద్వారా 2.41 లక్షల మంది రైతుల నుంచి 13.42 లక్షల టన్నుల మొక్కజొన్న సేకరించింది. వీటి విలువ రూ.3,757 కోట్లు కాగా.. ప్రస్తుతం లక్ష మంది రైతులకు డబ్బులు అందించింది.

త్వరలోనే నిధులు విడుదల

మిగిలిన రైతులకు త్వరలోనే నిధులు జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అలాగే తడిచిన ధాన్యాన్ని కూడా నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతున్నారు. రైతులు చేతికి వచ్చిన తమ పంటను నష్టపోతున్నారు. దీంతో రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇక ఇప్పటివరకు 57 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. వీటిని విక్రయించిన 8.15 లక్షల మంది రైతులకు డబ్బులను కూడా విడుదల చేసింది. వీటిల్లో తడిచిన 9,214 టన్నుల ధాన్యం ఉండగా.. వీటిని బాయిల్డ్ రైల్ మిల్లులకు తరలించింది.

తడిచిన ధాన్యం కూడా కొనుగోలు

తడిచిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించడం వల్ల ధాన్యాన్ని కాపాడుకోవచ్చు. ధాన్యాన్ని తరలించేందుకు ఇసుక రవాణా చేసే లారీలను కూడా కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం తరలించింది. ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రతిపక్షాల విమర్శలను ఎవరూ పట్టించుకోవద్దని, తాము తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. తాజాగా పంట కొనుగోళ్లు, నగదు విడుదల చేయడంపై సచివాలయంలో మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సీఎం పాల్గొన్నారు. కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని నిర్ణయించారు. ధాన్యం విక్రయించిన రైతులకు త్వరతగతిన నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Follow Us