Telangana: 2025 సంవత్సరం ప్రభుత్వ సెలవుల వివరాలు క్లియర్‌గా…

2025కి సంబంధించి హాలిడేస్ లిస్ట్‌ను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. ఇందులో 27 సాధారణ సెలవులను ప్రకటించగా.. 23 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. కాగా ఆప్షనల్ సెలవు తీసుకోవడానికి, ఉద్యోగులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. వారి సూపర్‌వైజర్ నుంచి అనుమతి పొందాలి.

Telangana: 2025 సంవత్సరం ప్రభుత్వ సెలవుల వివరాలు క్లియర్‌గా...
Government Holidays

Updated on: Dec 28, 2024 | 9:18 AM

మరో 3 రోజుల్లో 2024 సంవత్సరం ముగిసిపోతుంది. 2025లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టేందుకు అందరూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజాగా 2025లో పండగల సెలవులపై కూడా క్లారిటీ వచ్చింది.  2025 సంవత్సరానికి సంబంధించిన సాధారణ, ఆప్షనల్ సెలవుల లిస్ట్‌ను తెలంగాణ సర్కార్ తాజాగా రిలీజ్ చేసింది. వచ్చే ఏడాది మొత్తం 50 సెలవులు కాగా.. అందులో సాధారణ సెలవులు 27 , ఆప్షనల్ హాలిడేస్ 23 ఇస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. న్యూ ఇయర్ నేపథ్యంలో జనవరి 1న గవర్నమెంట్ సెలవు ప్రకటించింది. ఇందుకు బదులుగా ఫిబ్రవరి 08న రెండో శనివారాన్ని వర్కిండ్ డే అని పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది.  . చంద్రుని ఆధారంగా ఈద్, మొహర్రం వంటి పండుగల తేదీలు మారవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఎలాంటి మార్పులు జరిగినా మీడియా ద్వారా ప్రకటిస్తారు.

2025 సాధారణ సెలవుల లిస్ట్‌ దిగువన చూడండి…

 

సీరియల్ నంబర్ సెలవులు తేదీ రోజు
1. న్యూ ఇయర్ 01-01-2025 బుధవారం
2. భోగి 13-01-2025 సోమవారం
3. సంక్రాంతి 14-01-2025 మంగళవారం
4. రిపబ్లిక్​ డే 26-01-2025 ఆదివారం
5. మహా శివరాత్రి 26-02-2025 బుధవారం
6. హోళి 14-03-2025 శుక్రవారం
7. ఉగాది 30-03-2025 ఆదివారం
8. ఊద్​ ఉల్​ ఫితర్(రంజాన్) 31-03-2025 సోమవారం
9. రంజాన్​(మరుసటి రోజు) 01-04-2025 మంగళవారం
10. బాబూ జగ్జీవన్​ రామ్​ జయంతి 05-04-2025 శనివారం
11. శ్రీరామ నవమి 06-04-2025 ఆదివారం
12.  అంబేడ్కర్​ జయంతి 14-04-2025 సోమవారం
13. గుడ్​ ఫ్రైడే 18-04-2025 శుక్రవారం
14. ఈదుల్​ ఆజ్​ హా(బక్రీద్) 07-06-2025 శనివారం
15. షాహదత్​ ఇమామ్​ హుస్సేన్(ఆర్​.ఏ) 10వ మోహరం 06-07-2025 ఆదివారం
16. బోనాలు 21-07-2025 సోమవారం
17. స్వాతంత్య్ర దినోత్సవం 15-08-2025 శుక్రవారం
18. శ్రీకృష్ణ జన్మాష్టమీ 16-08-2025 శనివారం
19. వినాయక చవితి 27-08-2025 బుధవారం
20. ఈద్​ మిలాద్ ఉన్​ నబీ 05-09-2025 శుక్రవారం
21. బతుకమ్మ(ప్రారంభం రోజు) 21-09-2025 ఆదివారం
22. మహాత్మ గాంధీ జయంతి/విజయ దశమి 02-10-2025 గురువారం
23. విజయ దశమి (మరుసటి రోజు) 03-10-2025 శుక్రవారం
24. దీపావళి 20-10-2025 సోమవారం
25. కార్తిక పౌర్ణమి/గురునానక్​ జయంతి 05-11-2025 బుధవారం
26. క్రిస్మస్​ 25-12-2025 గురువారం
27. క్రిస్మస్​(బాక్సిండ్​ డే) మరుసటి రోజు 26-12-2025 శుక్రవారం

 ఆప్షనల్ హాలిడేస్ లిస్ట్‌ను దిగువన చూడండి….

Optional Holidays

Follow Us