ఇప్పుడా నియోజకవర్గంలో టఫ్ పైట్ నడుస్తుంది. ఒకప్పుడు కృష్ణార్జునుల్లా కలిసి ఉన్న ఆ ఇద్దరూ.. ఇప్పుడు ప్రత్యర్థులుగా మారడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ ఎక్కింది. పాత క్యాడర్ అంత ఇప్పుడు కొత్త నాయకత్వం వైపు మరలిపోతుండటం.. ఇప్పుడు ఆ నేతకు తలనొప్పిగా మారిందట. దీనికి తోడు సర్వేలు సైతం జూనియర్ కే జై కొట్టడంతో రాజకీయాల్లో తలపండిన ఆ నేత ఇప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారట.. ఇంతకీ ఆ జూనియర్ వర్సెస్ సినియర్ పైట్ ఎక్కడ.. అంతలా ఆ నేతను ఇబ్బంది పెడుతున్న ఆ నేత ఏవరు..?
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇప్పుడు హట్ సీట్ గా మారింది. గతంలో ఉద్దండుల మద్య పోటీ చూసిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రూరల్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పిసిపి ప్రెసిడెంట్ డి.శ్రీనివాస్‌నే మట్టికరింపించారు బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్. వారి అడుజాడల్లోనే ఎదిగి.. బయటకు వెళ్లి బీజేపీ తీర్ధం పుచ్చుకున్న ముఖ్య అనుచరుడు దినేష్ కులాచారి. ఇప్పుడా ఇద్దరి నేతలకు గట్టి పోటీగా ఎదిగారు దినేష్. డీఎస్ లాంటి నేతలను లైట్ తీసుకన్న బాజిరెడ్డి.. ఇప్పుడు బీజేపీతో కొంత టఫ్ సిష్యూయేషన్ నే ఫేస్ చేస్తున్నారట. రూరల్ అసలే లేని బీజేపీని దినేష్.. బీఆర్ఎస్ నుండి వస్తున్న వలసలతో నింపడం ఇప్పుడ రూరల్ బీఆర్ఎస్‌కు ప్రతికూలంగా మారిందట. ఆ వలసల భయంతో ఇప్పుడు బాజిరెడ్డి కూడా అలర్ట్ అయిపోయి క్యాడర్‌తో వరుస సమావేశాలు పెడుతున్నారట.
జూనియర్ వర్సెస్ సీనియర్..
సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు మాస్ లీడర్‌గా పేరుంది. గతంలో ఆర్మూర్ నుంచి, బాన్సువాడ నుంచి గెలుపొందారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి కూడా గెల్చి తన పట్టును నిలుపుకున్నారు. కానీ రెండోసారి గెలిచినప్పటి నుంచి కొంత ప్రతికూలత పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయట. అటు తన తనయుడు జగన్‌ను బరిలో దింపాలని భావించినా, పార్టీ అనుమతించక పోవడం, అందుకు క్యాడర్ కూడా మద్దతు ఇవ్వక పోవడంతో మళ్లీ మూడోసారి బాజిరెడ్డే బరిలో నిలిచారు. ఇక బాజిరెడ్డి తన క్యాడర్ లో కీలకంగా ఉన్న మాజీ జెడ్పీటీసీ, మార్కెట్ కమిటీ చైర్మన్ దినేష్ కులాచారి బయటకి వెళ్లి బీజేపీ తీర్ధం పుచ్చుకుని తన పైనే పోటీకి సిద్దపడటంతో ఇబ్బంది పడుతున్నారట ఈ సీనియర్ లీడర్. ఇక గతంలో బీఆర్ఎస్‌లో తనతో పాటు ట్రావెల్ చేసిన వారిని తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ కావడంతో.. అది కాస్తా బీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారిందట. బాజిరెడ్డి ఎత్తులు అన్ని తెలిసిన ఈ జూనియర్.. ఇప్పుడు మండలాల వారీగా పెద్ద లీడర్లను టార్గెట్ చేస్తున్నారట. ఇప్పటికే వలసలతో ఇబ్బంది పడుతున్న అధికార పార్టీకి ఈ ఎన్నికల ముందు వలసలు మరింత ఇబ్బంది పెడుతున్నాయట.
మోదీ సభతో బీజేపీలో పెరిగిన జోష్
ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ సభ తర్వాత నిజామాబాద్ బారతీయ జనతా పార్టీలో జోష్ పెరిగింది. ఆ ఉత్సహంతో క్యాడర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. నిజామాబాద్ జక్రాన్ పల్లి ఎయిర్ పోర్ట్, కాళేశ్వర జలాలు అంశాన్ని బీజేపీ, కాంగ్రెస్ లు ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నాయి. ఇక అటు బీఆర్ఎస్ కూడా సంక్షేమ పథకాలు, అభివృద్దిని చూపిస్తూ ఎన్నికలకు పోతుంది. అటు యూత్‌ను, మహిళలను తమ వైపు తిప్పుకునేలా బీజేపీ అడుగులు వేస్తుంది. ఇక ఒకే పార్టీలో ఉన్నా కృష్ణార్జులు, ఇప్పుడు వేరు వేరు పార్టీల నుండి బరిలోకి దిగడంతో అటు ఇద్దరితో సఖ్యంగా ఉన్నా క్యాడర్.. ఈ ఒక్కసారికి జూనియర్‌కు అవకాశం ఇద్దాం అనుకుంటే రూరల్ రాజకీయం బీజేపీ వైపు టర్న్ అవడం ఖాయం అనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు జూనియర్ వర్సెస్ సీనియర్ పైట్ లో ఎవరిపై చేయి సాధిస్తారనే క్యూరియాసిటి రోజు రోజుకు రూరల్ ఓటర్లలలో పెరిగిపోతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…