Telangana Eelctions: కాంగ్రెస్ తొలి జాబితాపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రియాక్షన్.. ఏమన్నారంటే..

|

Oct 16, 2023 | 8:16 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టికెట్‌ రాలేదని ఎవరూ బాధపడొద్దని నిజాయితీగా కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి ఒక్కరికా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పదవులు ఉంటాయని వాటిలో టికెట్ రానివారిని సర్దుబాటు చేస్తామన్నారు.

Telangana Eelctions: కాంగ్రెస్ తొలి జాబితాపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రియాక్షన్.. ఏమన్నారంటే..
Komatireddy Venkat Reddy
Follow us on

నల్లగొండ, అక్టోబర్ 15: కాంగ్రెస్‌ ఫస్ట్‌లిస్టు తర్వాత ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టులతో పొత్తు..కాంగ్రెస్‌కు కొంత నష్టమే అన్నారు. ఇక టికెట్‌ రాలేదని ఎవరూ బాధపడొద్దని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు కోమటిరెడ్డి.

70 స్థానాల్లో కాంగ్రెస్‌దే విజయం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టికెట్‌ రాలేదని ఎవరూ బాధపడొద్దని నిజాయితీగా కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి ఒక్కరికా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పదవులు ఉంటాయని వాటిలో టికెట్ రానివారిని సర్దుబాటు చేస్తామన్నారు.

వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు.. కాంగ్రెస్‌కు కొంత నష్టమేనని అభిప్రాయపడ్డారు ఎంపీ కోమటిరెడ్డి. మిర్యాలగూడ వామపక్షాలు అడుగుతున్నాయని.. అది కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే సీటని తెలిపారు. మునుగోడు ఇస్తామంటే వాళ్లు మాత్రం కొత్తగూడెం కోసం పట్టుబడుతున్నారని వివరించారు. జాతీయస్థాయిలో ప్రయోజనాలు చూసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకుందని దాన్ని అంతా గౌరవించాలన్నారు.

టికెట్ రాకుంటే తన టికెట్‌ ఇస్తానన్న కోమటిరెడ్డి..

తుంగతుర్తి టికెట్‌ విషయంలో చిట్‌చాట్‌గా మాట్లాడారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. కోమటిరెడ్డికి కంగ్రాట్స్‌ చెప్పేందుకు వచ్చిన తుంగతుర్తికి చెందిన కృష్ణవేణి, అక్కడి అభ్యర్థి అని స్పష్టం చేశారాయన. కృష్ణవేణికి టిక్కెట్‌ రాకుంటే..తన టిక్కెట్‌ ఆమెకు ఇస్తానన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

తుంగతుర్తిలో కాంగ్రెస్‌ గెలుస్తుందని పార్టీ సర్వే..

తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి 15 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సర్వేలో తుంగతుర్తిలో గెలుస్తుందనే మాట వినిపిస్తోంది. వీరిలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతోందో సర్వేల ఆధారమా? లేక ఆర్థికంగా బలమైన అభ్యర్థిని సూచిస్తారా ?అనేది తేలాల్సి ఉంది. లేక కోమటిరెడ్డి సూచించినట్లు కృష్ణవేణికే టికెట్‌ దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..