Telangana Election: బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటేనన్న రాహుల్.. తెలుగులో మాట్లాడి కార్యకర్తల్లో జోష్ నింపిన ప్రియాంక

మలివిడత పర్యటనలో తెలంగాణ గడ్డను రౌండప్ చేశారు కాంగ్రెస్ అగ్రనేతలు. విజయభేరి సభలు, కార్నర్ మీటింగులు, రోడ్‌షోలతో సందడి చేశారు. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో క్యాడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ దొందూదొందేనని, తోడుదొంగలని విమర్శించారు రాహుల్ అండ్ ప్రియాంక.

Telangana Election: బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటేనన్న రాహుల్.. తెలుగులో మాట్లాడి కార్యకర్తల్లో జోష్ నింపిన ప్రియాంక
Rahul, Priyanka, Mallikarjun Kharge

Updated on: Nov 25, 2023 | 6:14 PM

మలివిడత పర్యటనలో తెలంగాణ గడ్డను రౌండప్ చేశారు కాంగ్రెస్ అగ్రనేతలు. విజయభేరి సభలు, కార్నర్ మీటింగులు, రోడ్‌షోలతో సందడి చేశారు. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో క్యాడర్‌లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ దొందూదొందేనని, తోడుదొంగలని విమర్శించారు రాహుల్ అండ్ ప్రియాంక.

బోధన్, ఆదిలాబాద్, వేములవాడ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాహుల్ గాంధీ. దొరల తెలంగాణ కావాలా, ప్రజల తెలంగాణ కావాలా అనే నినాదాన్ని పదేపదే రిపీట్ చేశారు. కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లు దోచుకున్నారని, ధరణి ముసుగులో 20 లక్షలమంది నుంచి భూముల్ని లాక్కున్నారని బీఆర్‌ఎస్‌పై ఎటాక్ చేశారు. కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతున్న కేసీఆర్‌కి.. ఆయన చదువుకున్న స్కూళ్లు, కాలేజీలన్నీ కాంగ్రెస్‌ కట్టించినవేనన్న సంగతి తెలీకుండా పోయిందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని, ప్రజల సంపదను దోచుకుంటున్నాయని ఆరోపించారు రాహుల్‌ గాంధీ.

మరోవైపు నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ కూడా తెలంగాణ దంగల్‌లో సందడి చేశారు. ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ రోడ్ షోలలో పాల్గొంటూ ఉత్సాహంగా ప్రసంగాలను సాగిస్తున్నారు. అంతేకాదు రోడ్ షో కి వచ్చిన కార్యకర్తలకు మరింత ఉత్సాహం నింపేందుకు ప్రియాంక గాంధీ ప్రచార రథం పైన డ్యాన్స్ చేసి అందరిని అలరించారు. ఖమ్మంలోని కల్లూరులో కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. సత్తుపత్తి రోడ్‌షోలో బిగ్ ఎట్రాక్షన్ అయ్యారు. కాంగ్రెస్ ఎన్నికల నినాదంతో కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు.

తర్వాత మధిరలో జరిగిన కాంగ్రెస్ విజయభేరిలో బీఆర్‌ఎస్‌ని సూటిగా టార్గెట్ చేశారు. బలమైన ప్రభుత్వం ఏర్పడి ఉంటే తెలంగాణ ప్రజల కలలు నెరవేరేవని, రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్, ఆ తర్వాత మాట తప్పారని విమర్శించారు. పాలేరులో జరిగిన రోడ్‌షోలో గిరిజనులను తన వాహనంపైకి ఎక్కించుకుని, వాళ్లతో కలిసి నృత్యం చేశారు ప్రియాంకగాంధీ.

అటు… ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కల్వకుర్తి సభలో ప్రసంగించారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హైదరాబాద్‌లో రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌ల్లో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలతో తెలంగాణ దంగల్‌ని మరింత హీటెక్కించారు కాంగ్రెస్ నేషనల్ లీడర్లు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..