CM KCR: కేసీఆర్‌ మార్క్‌ పాలిటిక్స్‌.. లిస్టులతో కాంగ్రెస్‌, బీజేపీ కుస్తీ..! ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్‌ఎస్‌..

Telangana Election 2023: జాతీయ పార్టీలు ఇంకా అభ్యర్థుల జాబితాలతో కుస్తీలు పడుతుంటే.. ఎన్నికల వ్యూహాల్లో ముందుకు దూసుకుపోతోంది గులాబీ పార్టీ. బీఆర్‌ఎస్‌ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, వార్‌రూమ్‌ ఇన్‌చార్జీలతో కేటీఆర్‌, హరీష్‌రావు భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహంపై చర్చించారు. మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లాలంటూ లీడర్లు, కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.

CM KCR: కేసీఆర్‌ మార్క్‌ పాలిటిక్స్‌.. లిస్టులతో కాంగ్రెస్‌, బీజేపీ కుస్తీ..! ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్‌ఎస్‌..
Cm Kcr

Updated on: Oct 22, 2023 | 9:55 PM

Telangana Election 2023: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పూర్తిగా ఖరారు కాలేదు. జాబితాలు ఇంకా తయారవుతూనే ఉన్నాయి. లిస్టులతో కుస్తీలు పడుతున్నారు. వడపోతల కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదీ.. కాంగ్రెస్‌, బీజేపీల పరిస్థితి. మరోవైపు ఏక్‌దమ్మున ఒకే లిస్టులో 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసిన బీఆర్‌ఎస్‌.. ఎన్నికల ప్రచారంలో కూడా దూకుడు పెంచేసింది. ఓవైపు వరుస సభలతో సీఎం కేసీఆర్‌ ఓ రౌండ్ ముగించేశారు. మరోవైపు మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావులు జనంలోనే ఉంటూ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. భారత రాష్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాలతో పార్టీ క్యాడర్‌లో ఫుల్‌ జోష్‌ నింపుతున్నారు. అంతేకాకుండా.. హ్యాట్రిక్‌ విజయం సాధించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. బీఆర్‌ఎస్‌ ఎన్నికల సంగ్రామంలో దూకుడుపెంచింది. ఇలా కేసీఆర్ మార్క్ పాలిటిక్స్.. ఎన్నికల షెడ్యూల్ ప్రారంభంలోనే గులాబీ పార్టీలో ఫుల్ జోష్ నింపుతున్నాయి.

ఎన్నికల వ్యూహంపై చర్చ.. మేనిఫెస్టోపై దిశానిర్దేశం

హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్ లో బీఆర్‌ఎస్ కీలక సమావేశం నిర్వహించింది. మంత్రులు కేటీఅర్, హరీష్‌రావుల అధ్వర్యంలో సమావేశం జరిగింది. నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, వార్‌ రూమ్‌ ఇన్‌చార్జీలతో భేటీ అయిన కేటీఆర్‌, హరీష్‌.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లే అంశంపై పార్టీ లీడర్లు, కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.

ఒక్క నెల కష్టపడాలన్న హరీష్‌.. గడపగడపకు మేనిఫెస్టో

కాంగ్రెస్‌ చేస్తున్న గ్లోబెల్స్‌ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు హరీష్‌ రావు. మూడోసారి కేసీఆర్‌ సీఎం కాబోతున్నారని సర్వేలు చెబుతున్నాయన్నారు హరీష్‌. నెల రోజులు కష్టపడి పనిచేయాలని, అవసరం అయినచోట రాత్రి బస చేయాలని నేతలు, కార్యకర్తలకు ఆయన సూచించారు. ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. మీడియా, సోషల్‌ మీడియా ద్వారా మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దానికి సంబంధించిన స్టిక్కర్‌ను ప్రతి ఇంటికి అతికించాలన్నారు హరీష్‌.

నవంబర్‌ 30న జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించబోతోందని జోస్యం చెప్పారు మంత్రి కేటీఆర్‌. బీజేపీకి 100 స్ధానాల్లో, కాంగ్రెస్‌కు 40 స్థానాల్లో అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు కేటీఆర్‌. హైదరాబాద్‌ జలవిహార్‌లో పార్టీ ఇంఛార్జ్‌లతో సమావేశమైన ఆయన ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇలా.. రాజకీయ ప్రత్యర్థులకు అందనంత స్పీడుతో ఎన్నికల రేసులో బీఆర్‌ఎస్‌ కారు దూసుకుపోతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..