Telangana: రైతుబంధు నిధులు విడుదలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష.. అధికారులకు కీలక అదేశాలు

|

Jan 07, 2024 | 8:14 AM

రైతుబంధు నిధులు విడుదలపై వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం (జనవరి 6) ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, వ్యవసాయ శాఖ కార్యదర్శి, డైరెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 40 శాతం మంది రైతులకు రైతుబంధు అంటే 27 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..

Telangana: రైతుబంధు నిధులు విడుదలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష.. అధికారులకు కీలక అదేశాలు
Rythu Bandhu Review Meeting
Follow us on

హైదరాబాద్‌, జనవరి 7: రైతుబంధు నిధులు విడుదలపై వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం (జనవరి 6) ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, వ్యవసాయ శాఖ కార్యదర్శి, డైరెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 40 శాతం మంది రైతులకు రైతుబంధు అంటే 27 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వరి, ఇతర వరి పంటల నాట్లు, సాగు జోరుగా సాగుతున్నందున రైతుబంధును వెంటనే జమ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు నిధులు విడుదలయ్యేలా చూడాలని, వచ్చే సోమవారం నుంచి రైతుబంధు కార్యక్రమానికి పెద్దఎత్తున రైతులు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

సంక్రాంతి తర్వాత ఈ విషయాన్ని మరింత సమీక్షించనున్నట్లు తెలిపారు. కొత్త ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, గత ప్రభుత్వం నుంచి సంక్రమించిన ఆర్థిక పరిస్థితి కష్టతరమైనప్పటికీ రైతులకు సకాలంలో రైతుబంధు అందించేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుబంధు డబ్బు విడుదలపై రాష్ట్ర రైతులు, ప్రజలు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని అన్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా రైతుబంధు సకాలంలో అందేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆర్థిక శాఖ వ్యవసాయ శాఖ కార్యదర్శులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రివ్యూ మీటింగ్‌లో పేర్కొన్నారు.

కొమురంభీం జిల్లా టెరిటోరియల్ వార్‌లో పెద్దపులి మృతి

కొమురంభీం జిల్లాలోని కాగజ్‌నగర్‌ డివిజన్ పరిధిలోని దరిగాం అటవీ ప్రాంతంలో రెండు పెద్ద పులులు పోటాపోటీగా కొట్టుకున్నాయి. ఈ ఘర్షణలో తీవ్రగాయాల పాలైన మూడేళ్ల ఆడపులి మృతి చెందింది. వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్ర సరిహద్దు మాలిని అటవి ప్రాంతానికి సమీపంలోని గోంది, దరిగాం అటవీ ప్రాంతంలో కొమురంభీం ప్రాజెక్టు కాలువ సమీపంలో అనుహ్యంగా తారాసపడ్డ రెండు పెద్దపులులు తీవ్రంగా కొట్టుకున్నాయి. ఇరు పులులు ఒకదానిపై మరొకటి దాడి చేసుకున్నాయి. ఆడపులికి తీవ్రగాయాలుకాగా దరిగాం అటవి ప్రాంతంలో మృతి చెందింది. మరో మగ పులికి తీవ్రగాయాలయ్యాయి. ట్రాప్ కెమెరాల ఆధారంగా గాయపడిన పులి కదలికలను అటవిశాఖ గుర్తించింది. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా మృతి చెందిన పులికి అటవీశాఖ అంత్యక్రియలు చేసింది. అటవిశాఖ పులుల దాడి ఘటనపై అటవిశాఖ సిబ్బంది ఈ మేరకు స్పందించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.