Covid-19: తెలంగాణలో కరోనా విజృంభణ.. 3వేలు దాటిన కేసుల సంఖ్య.. ఎంతమంది చనిపోయారంటే?

|

Apr 11, 2021 | 10:43 AM

Telangana Corona Updates: కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు

Covid-19: తెలంగాణలో కరోనా విజృంభణ.. 3వేలు దాటిన కేసుల సంఖ్య.. ఎంతమంది చనిపోయారంటే?
Covid-19 cases
Follow us on

Telangana Corona Updates: కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 3,187 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను ఆదివారం ఉదయం విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసుల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,27,278 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,759 కి చేరింది.

కాగా.. గత 24 గంటల్లో కరోనా నుంచి 787 మంది కోలుకున్నారు. వీరితో కలిపి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3,05,335 కి చేరింది. నిన్న అత్యధికంగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 551, మేడ్చల్‌ జిల్లాలో 333, రంగారెడ్డి జిల్లాలో 271 నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో నిన్న 1,15,311 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీరితో కలిపి ఇప్పటివరకూ 1,09,88,876 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు.

Also Read:

Double Murder: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. కాపురానికి రావడం లేదని భార్యను, పంపడం లేదని అత్తను..

Case File On Chandrababu: చంద్రబాబు, లోకేష్‌పై కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.. కారణమేంటంటే..