Telangana Coronavirus: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!

|

Jan 21, 2022 | 7:28 PM

Telangana Coronavirus: తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తి చెంది రెండేళ్లు కావస్తోంది. ప్రభుత్వం..

Telangana Coronavirus: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!
Follow us on

Telangana Coronavirus: తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తి చెంది రెండేళ్లు కావస్తోంది. ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా తగ్గుముఖం పట్టగా, ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఒక వైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ , మరోవైపు కరోనా కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక తాజాగా శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 4,416 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,26,819 కాగా, మరణాల సంఖ్య 4,069 ఉంది. ఇక రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 6,93,623 ఉండగా, తాజాగా 1920 మంది రికవరీ అయ్యారు. అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 95.43 శాతం ఉంది. ఇక ఐసోలేషన్‌లో 29,127 మంది ఉన్నారు.

ఒక వైపు కరోనా, మరోవైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా కోవిడ్‌ నిబంధ‌న‌లు పాటిస్తే కేసుల సంఖ్యను తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Lockdown News: హడలెత్తిస్తున్న కోవిడ్ థర్డ్ వేవ్.. ఆ రాష్ట్రంలో ఒక్క రోజు సంపూర్ణ లాక్ డౌన్

AP Corona Cases: ఏపీలో దడ పుట్టిస్తోన్న కరోనా కేసులు.. ఆ జిల్లాలో ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి