కంప్లయింట్స్‌ వద్దు..పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో చెప్పండి.. స్ట్రాటజీ కమిటీలో రాహుల్‌ సీరియస్‌

Rahul Gandhi: కాంగ్రెస్‌ స్ట్రాటజీ మీటింగ్‌ వాడివేడిగా జరిగిందా.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలపై రాహుల్‌ సీరియస్‌ అయ్యారా.. చెప్పిందే చెప్పకుండా..కంప్లయింట్స్‌ చేయకుండా.. కామ్‌గా పార్టీ కోసం పనిచేయాలని క్లాసు పీకారా.. ఇకపై, మీడియా ముందు ఇంటర్నల్‌ ప్రాబ్లమ్స్‌ మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని లేదని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారా.. ఏదైనా ఉంటే ఖర్గేకు, కేసీ వేణుగోపాల్‌కు చెప్పుకోవాలని క్లారిటీ ఇచ్చారా..

కంప్లయింట్స్‌ వద్దు..పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో చెప్పండి.. స్ట్రాటజీ కమిటీలో రాహుల్‌  సీరియస్‌
Rahul Gandhi

Updated on: Jun 27, 2023 | 8:35 PM

Telangana Politics: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీకి వెళ్లి తలంటించుకొచ్చారా.. అవుతను.. దాదాపు అదే జరిగిందంటున్నారు లీడర్లు.. కాంగ్రెస్‌ స్ట్రాటజీ మీటింగ్‌లో రాహుల్‌..నేతలందరికీ ఫుల్ క్లారిటీ ఇచ్చారట. మూడు గంటలపాటు జరిగిన మీటింగులో సంచుల నిండా సమస్యలను మోసుకెళ్లిన నేతలు రాహుల్‌ ముందు ఏకరువు పెట్టారట.. తెలంగాణలో పార్టీ ఫుల్‌ జోష్‌లో ఉందని చెబుతూనే..ఏదో చెప్పబోతోంటే..రాహుల్‌ కంప్లయింట్స్‌ వద్దే వద్దు.. పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో చెప్పండి..గతంలో కూడా ఇదే చెప్పాను.అయినా కూడా ప్రతి సారీ ఇదే జరుగుతోంది. మీడియా ముందు పార్టీకి సంబంధించిన ఇంటర్నల్‌ ప్రాబ్లమ్స్‌ మాట్లాడకండి.. ఈ సారి మళ్లీ రిపీటైతే మాత్రం.. కచ్చితంగా యాక్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.. ఒకరిద్దరిపై వేటు వేస్తే కానీ..మారరా..ఇంకెన్నిసార్లు చెప్పాలి..ఏదైనా ఉంటే..ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ దగ్గర చెప్పుకోండి.. అని రాహుల్‌ గట్టిగానే ఇచ్చినట్లు తెలుస్తోంది.

మీటింగ్‌ గురించి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల కార్యాచరణ మొదలైందని..రాబోయే 120 రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపైనా చర్చ జరిగింది. కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించాం. రాహుల్‌ గాంధీ కూడా తమకు దిశానిర్దేశం చేశారని..కేసీఆర్‌ను గద్దె దించుతామని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా సమావేశంలో చర్చ జరిగిందన్నారు కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌కు పొత్తు ఉండదన్నారు కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ. కాంగ్రెస్‌ వ్యూహాత్మక సమావేశానికి తెలంగాణలోని దిగ్గజ నేతలంతా హాజరయ్యారు. మరి హైకమాండ్‌ ఆదేశాలతో ఇకనుంచైనా లుకలుకలను పక్కనపెట్టి కలిసికట్టుగా కర్నాటక ఫార్ములాను అమలు చేస్తారా..లేదంటే మళ్లీ అదే పాట పాడుతారా.. వెయిట్‌ అండ్‌ సీ..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం