Telangana: అలర్ట్ అయిన కాంగ్రెస్ ముఖ్యులు.. ఆ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్..

|

Jul 06, 2022 | 11:09 PM

Telangana: తన పాత నియోజకవర్గం కోదాడపై దృష్టిపెట్టారు నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. కోదాడ మండలం కాపుగల్లులో కాంగ్రెస్

Telangana: అలర్ట్ అయిన కాంగ్రెస్ ముఖ్యులు.. ఆ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్..
Uttam Kumar Reddy
Follow us on

Telangana: తన పాత నియోజకవర్గం కోదాడపై దృష్టిపెట్టారు నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. కోదాడ మండలం కాపుగల్లులో కాంగ్రెస్ పార్టీ రచ్చబండలో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా యాత్రలో పాల్గొన్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కోదాడలో కాంగ్రెస్‌ అభ్యర్థి వచ్చే ఎన్నికల్లో 50వేల మెజార్టీతో గెలుస్తారన్నారు. 50 వేల మెజారిటీ కంటే ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు ఉత్తమ్‌.

గత ఎన్నికల్లో కోదాడ నుంచి ఉత్తమ్‌ సతీమణి పద్మావతి పోటీచేశారు. అయితే ఆ ఎన్నికల్లో పద్మావతి.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్‌చేతిలో ఓటమి పాలయ్యారు. కేవలం 756 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కోదాడలో భార్య ఓడినా.. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌ గెలిచారు. ఆ తర్వాత ఎంపీగా గెలిచి హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి. ప్రస్తుతం హుజూర్‌నగర్లోనూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాగావేస్తామన్న ధీమాతో ఉన్నారు ఉత్తమ్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..