Jagga Reddy: కాంగ్రెస్‌లో కొనసాగుతున్న హుజూరాబాద్ చిచ్చు.. రాష్ట్ర నేతలే కారణమంటున్న జగ్గారెడ్డి!

|

Nov 14, 2021 | 1:30 PM

హుజురాబాద్‌ పోస్ట్‌మార్టంపై హస్తినలో నిర్వహించిన సమీక్షలో కరుణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు ఒక్కొక్కొరు ఒక్కో కారణం చెప్పుకొచ్చారు. రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించారు.

Jagga Reddy: కాంగ్రెస్‌లో కొనసాగుతున్న హుజూరాబాద్ చిచ్చు.. రాష్ట్ర నేతలే కారణమంటున్న జగ్గారెడ్డి!
Jaggareddy
Follow us on

Jagga Reddy hot comments: హుజురాబాద్‌ పోస్ట్‌మార్టంపై హస్తినలో నిర్వహించిన సమీక్షలో కరుణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు ఒక్కొక్కొరు ఒక్కో కారణం చెప్పుకొచ్చారు. రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించారు. గతం గతహా ఇక 2023పై ఫోకస్ పెట్టండి అంటూ అధిష్టానం దూత కేసీ వేణుగోపాల్ డైరెక్షన్‌ మేరకు అంతా బయటకు వచ్చి ప్రెస్‌మీట్ పెట్టారు. ఉదయం అంతా రచ్చ రచ్చ. రెండు గ్రూప్‌లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. దీంతో సమావేశం సాయంత్రానికి వాయిదా పడింది. అధిష్టానం అసహనమో, ఇలా అయితే ఢిల్లీలో కూడా పలుచబడుతామని అనుకున్నారో ఏమో సాయంత్రానికి ఒక్కతాటిపైకి వచ్చారు.

హుజురాబాద్ పోస్ట్‌మార్టం ఇక ఆపుతాం.. రిపోర్ట్ వచ్చాక అధిష్టానం చూసుకుంటోంది. తమకిక 2023 ఎన్నికలే టార్గెట్ అన్నారు రాష్ట్ర వ్యహారాల ఇంచార్జ్‌ మాణిక్యం ఠాగూర్. టీఆర్ఎస్, బీజేపీలు కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్న ఠాగూర్ ఆ పార్టీల తీరును ప్రజాక్షేత్రంలో తీసుకెళ్తామన్నారు. 2023 ఎన్నికల కోసం వ్యూహ రచన చేశామన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తామంతా సమన్వయంతో, ఐకమత్యంగా ముందుకెళ్తామన్నారు. 2023లో గెలుపు కోసం సర్వశక్తులతో కృషి చేస్తామన్నారు.

ఇదిలావుంటే, కాంగ్రెస్ అధిష్టానం నేతల తీరు పట్ల తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌‌ ఉపఎన్నిక ఫలితాల తర్వాత ఢిల్లీలో జరిగిన పరిణామాలపై మరోసారి జగ్గారెడ్డి ఘాటుగానే స్పందించారు. వార్‌ రూమ్‌లో జరిగిన చర్చకు తనను ఆహ్వానించి ఉంటే కాంగ్రెస్‌ ఓటమికి గల కారణాలు అధిష్టానానికి చెప్పేవాడనన్నారు. హుజూరాబాద్‌‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న తనను రివ్యూకి మీటింగ్‌కి పిలవకపోవడం వల్లే లేఖ రాశానన్నారు. కాంగ్రెస్‌ ఓటమికి అభ్యర్ధి పేరు ప్రకటించడంలో ఆలస్యమే కారణమన్నారు. ఈవిషయంలో ఎవరెవరు ఎలాంటి రాజకీయాలు చేశారో త్వరలో చెబుతానన్నారు. ఏది ఏమైనా జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు. దీని కంతటికి రాష్ట్ర నాయకత్వమే కారణమంటూ దుమ్మెత్తిపోశారు.

Read Also… TRS: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ కసరత్తు.. ఫైనల్ లిస్ట్‌లో ఆ ఇద్దరి పేర్లు..