Watch Video: బాక్సింగ్ రింగ్‌లో కాలు దువ్విన ఫ్రెంచ్ బుల్ డాగ్‌కు చుక్కలు చూపించిన పల్లెటూరి కోడిపుంజు..!

| Edited By: Balaraju Goud

Jan 04, 2025 | 11:40 AM

బాక్సింగ్ రింగ్ లో....కాలు దువ్విన ఫ్రెంచ్ బుల్ డాగ్ కు చుక్కలు చూపించింది. కిక్ బాక్సింగ్ అంటే తెలియని వారుండరు. బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్థికి చెమటలు పట్టించేలా పంచ్ ఇస్తే చాలు. దెబ్బకు ఢమాల్ అవ్వాల్సిందే. మనం కోడి పందాలు చూస్తున్నాం కానీ.. ఇక్కడ కోడి పుంజు, కుక్క హోరాహోరీగా సై అంటే సై అంటూ తలపడ్డాయి.

Watch Video: బాక్సింగ్ రింగ్‌లో కాలు దువ్విన ఫ్రెంచ్ బుల్ డాగ్‌కు చుక్కలు చూపించిన పల్లెటూరి కోడిపుంజు..!
French Bulldog Cock Fight
Follow us on

సంక్రాంతి అంటేనే తెలుగు వారు అతిపెద్ద పండుగల్లో ఒకటి..! మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందాలు.. కొన్ని ప్రాంతాల్లో ముందే పండగ వాతావరణం వచ్చింది. కోడి పందాలు జోరు కొనసాగుతోంది. మనం కోడి పందాలు చూస్తున్నాం కానీ.. ఇక్కడ కోడి పుంజు, కుక్క హోరాహోరీగా సై అంటే సై అంటూ తలపడ్డాయి.

బాక్సింగ్ రింగ్ లో….కాలు దువ్విన ఫ్రెంచ్ బుల్ డాగ్ కు చుక్కలు చూపించింది. కిక్ బాక్సింగ్ అంటే తెలియని వారుండరు. బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్థికి చెమటలు పట్టించేలా పంచ్ ఇస్తే చాలు. దెబ్బకు ఢమాల్ అవ్వాల్సిందే. అయితే రింగ్ లో కోడిపుంజుతో ఫ్రెంచ్ డాగ్ కాలు దువ్వి ఆఖరు నిమిషంలో ప్రత్యర్థి పంచ్ కు చెమటలు పట్టి ఊడాయించిన తీరు చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఇంతకు కిక్ బాక్సింగ్ ఎంటి..? అనుకుంటున్నారా.. తాజాగా ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటన చూస్తే మీకే అర్థమవుతుంది.

ఖమ్మం జిల్లా వేంసూరు లో ఒక రైతు పెంచుకునే ఫ్రెంచ్ బుల్ కుక్క మస్త్ హుషార్ ఉంటుంది. ఆ రైతు ఇంటి ఆవరణలో కోడిపుంజులను కూడా పెంచుకుంటున్నారు. కోడిపుంజు అంటేనే ఫైటింగ్‌లో ప్రావీణ్యం ఉంటుంది. కాలుకు కత్తి కట్టి రణరంగంలో అడుగు పెడితే మాములుగా ఉండదు. అదేనండి కోడి పందాల బిర్రులో పుంజులు కాలుతో కిక్కు ఇస్తే అంతే సంగతి..! పేరుకు మాత్రమే ఫ్రెంచ్ బుల్ డాగ్.. మరి ఆ ఫ్రెంచ్ బుల్ డాగ్ కు తెలియదు కదా తెలంగాణ కోడిపుంజు కిక్ బాక్సింగ్ దెబ్బ ఎలా ఉంటుందో..!

వీడియో చూడండి.. 

తాజాగాఆ ఫ్రెంచ్ బుల్ డాగ్ వెళ్లి కోడి పుంజుతో ఫైటింగ్ చేద్దామని సరదాగా కాలు దువ్వింది. పుంజు కిక్ కి వామ్మో.. వాయో అంటూ ఫ్రెంచ్ బుల్ డాగ్ ఉడాయించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఏదైనా సత్తుపల్లి కోడి పుంజుల సత్తా ఏంటో ఈ వీడియో చూస్తే తెలుస్తుందని సరదాగా కామెంట్స్ కూడా పెడుతున్నారు…

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..