
తెలంగాణ రాష్ట్రంలోని గవర్నమెంట్ స్కూల్ టీచర్స్‌కు గుడ్ న్యూస్ ఇది. ప్రభుత్వం ఎట్టకేలకు ఉపాధ్యాయుల పదోన్నతులపై నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత ఫైల్‌పై సంతకం చేయడంతో.. పదోన్నతుల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులపై ప్రభుత్వం స్పందించడంతో ఎస్జీటీలు (సెకండరీ గ్రేడ్ టీచర్లు), స్కూల్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఇది మంచి ఊరటగా చెప్పవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2000 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పదోన్నతులతో ఖాళీ అయ్యే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎస్జీటీలతో భర్తీ చేయనున్నారు.
పదోన్నతుల ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు ప్రారంభించినట్టు సమాచారం. ముందస్తు ప్రణాళికల ప్రకారం.. వచ్చే రెండు రోజుల్లో అధికారిక షెడ్యూల్ విడుదల అయ్యే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో జోన్‌లు, సీనియారిటీ, ఖాళీల గణన వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణలో ఉపాధ్యాయ పదోన్నతులు గత కొన్ని సంవత్సరాలుగా వివిధ కారణాలతో నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో అనేక మంది సీనియర్ ఉపాధ్యాయులు తమ నైపుణ్యం మేరకు ఉన్నత స్థానాలకు చేరక పోవడం వల్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధ్యాయ సంఘాలు పదోన్నతులపై పలుమార్లు విజ్ఞప్తులు చేసాయి. తాజాగా సీఎం ఆ ఫైల్‌పై సంతకం చేవారు. విధివిధానాల ప్రకారం.. పదోన్నతులకు అవసరమైన జోన్‌ల వారీ ఖాళీల వివరాలు, అర్హతలు, అభ్యర్థుల సీనియారిటీ లిస్టులు త్వరలో వెబ్‌సైట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. అంతేగాక.. కొద్ది వారాల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసి… ఆ ఉపాధ్యాయులను కొత్త పోస్టులలో నియమించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.
మరిన్ని తెలంగాణవార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..