AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సందర్భం వస్తే ఆమరణ దీక్ష చేస్తా… చిట్‌చాట్‌లో సీఎం సంచలన కామెంట్స్‌

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై విమర్శలతో దాడి చేశారు. కేసీఆర్‌ను ఓడించి.. సీఎం కుర్చీలో నుంచి దింపింది తానే అన్నారు రేవంత్‌. ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండు సున్నా వచ్చిందంటే కారణం తానేనని కేటీఆర్‌ గుర్తించాలని చెప్పారు రేవంత్‌రెడ్డి. స్టేటస్ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారు.. అసలు కేటీఆర్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అని

సందర్భం వస్తే ఆమరణ దీక్ష చేస్తా... చిట్‌చాట్‌లో సీఎం సంచలన కామెంట్స్‌
Revanth Reddy
K Sammaiah
|

Updated on: Mar 10, 2025 | 2:53 PM

Share

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై విమర్శలతో దాడి చేశారు. కేసీఆర్‌ను ఓడించి.. సీఎం కుర్చీలో నుంచి దింపింది తానే అన్నారు రేవంత్‌. ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గుండు సున్నా వచ్చిందంటే కారణం తానేనని కేటీఆర్‌ గుర్తించాలని చెప్పారు రేవంత్‌రెడ్డి. స్టేటస్ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారు.. అసలు కేటీఆర్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అని ప్రశ్నించారు. అధికారం పోయిందనే అక్కసుతో కేటీఆర్ మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ది అసెంబ్లీకి వచ్చే స్థాయి కాదన్నారు రేవంత్.

క్రిమినల్స్ ఎప్పుడూ కేసులకు భయపడరు. కేసులకు భయపడితే క్రైమ్ చేయరు. అందుకే కేటీఆర్‌ భయపడను అంటున్నారంటూ రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేటీఆర్‌ గురించి మాట్లాడడం కూడా అనవసరం అంటూ ఎద్దేవా చేశారు సీఎం రేవంత్.

ఇక కిషన్‌రెడ్డిపైనా రేవంత్‌రెడ్డి విమర్శలు చేశారు. కిషన్‌రెడ్డి నేనే మెట్రో తెచ్చానంటున్నారు.. కిషన్‌రెడ్డి తెచ్చిన మెట్రో ఎక్కడుంది? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణకు కిషన్‌రెడ్డి నిధులుతెస్తే సన్మానం చేస్తానని చెప్పారు. కనీసం అఖిలపక్ష భేటీకి కిషన్‌రెడ్డి రాలేదని రేవంత్ విమర్శించారు. కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి నిధులు తెస్తే వద్దంటామా..? అని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. రింగ్ రోడ్డు అంటే రింగ్ ఉండాలి కదా.. మరి సగం ఇచ్చి రింగ్ అని ఎలా అంటారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమస్యలపై ఉమ్మడి పోరాటం కోసం అఖిల పక్షం పెడితే బీజేపీ వాళ్లు రాలేదు.. కేసీఆర్‌ ఏమైనా అంటారనే కిషన్ రెడ్డి ఆ సమావేశానికి రాలేదేమో అని సీఎం రేవంత్‌ అన్నారు.

అన్ని రాష్ట్రాలను బీజేపీ సమానంగా చూడటం లేదని సీఎం రేవంత్ ఆరోపించారు. బుల్లెట్ ట్రైన్‌ గుజరాత్ ఇచ్చారు.. తెలంగాణ ఎందుకు ఇవ్వడం లేదని రేవంత్‌ ప్రశ్నించారు. తెలంగాణ కడుతున్న పన్నులు ఎంత .. తిరిగి కేంద్రం కేటాయించిన నిధులు ఎంత..? చర్చకు వస్తానంటే సీఎంగా తాను, భట్టి చర్చకు రావడానికి సిద్ధమని కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 99 సార్లయినా ఢిల్లీ వెళ్తానని చెప్పారు. తాను ఢిల్లీకి వెళ్లడం వల్లనే హైదరాబాద్‌లో అభివృద్ధి కావాల్సిన క్లియరెన్స్ వచ్చిందని రేవంత్‌ చెప్పారు.

పట్టభద్రుల ఎన్నికల్లో అసలు పోటీ చేయకుండా తప్పించుకున్నది బీఆర్ఎస్‌ కాదా..? అని రేవంత్‌ ప్రశ్నించారు. హరీశ్ రావు లాంటి వాళ్ళు దొంగ దెబ్బ తీశారని సీఎం చిట్‌చాట్‌లో కామెంట్‌ చేశారు. మందకృష్ణ మాటలు… బీజేపీ మాటలుగా కొట్టిపడేశారు. ఏపీలో అసలు వర్గీకరణే మొదలుకాలేదని తిప్పికొట్టారు. గతంలోనే SLBC పూర్తిచేసి ఉంటే ప్రమాదం జరిగేదికాదు.. చావులను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని రేవంత్‌ విమర్శించారు.

Follow Us
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!